సమంతపై బెల్లంకొండ సురేష్ కంప్లైంట్..వివాదం
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇప్పుడు మరో వివాదానికి తెరతీసారు. దూకుడుతో స్టార్ గా పెద్ద హీరోల సరసన బుక్కవుతూ దూసుకుపోతున్న సమంతపై ఆయన మూవీ ఆర్టిస్టుల అశోశియేషన్ మరియు నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసారు. ఆమె అన్ ప్రొఫెషనల్ బిహేవియర్ ఈ కంప్లైంట్ లో ప్రధానాంశం. ఆమెను తమ సినిమాలో సిద్దార్ధ సరసన బుక్ చేసుకోగా ఆమె అదే డేట్స్ ని మహేష్ చిత్రం కేటాయించి తమను ఫైనాన్సియల్ క్రైసిస్ లో పడేసిందని ఆయన ఆరోపిస్తున్నారు. నందినీరెడ్డి దర్శకత్వంలో ఆయన సిద్దార్ద హీరోగా ఓ చిత్రం ప్లాన్ చేసారు. అందులో సిద్దార్ద సరసన సమంతను తీసుకున్నారు. అయితే సమంత అడ్వాన్స్ తీసుకుని డేట్స్ కేటాయించి ఈ లోగా మహేష్ తో దిల్ రాజు నిర్మిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కోసం అవే డేట్స్ ని ఇచ్చేయటం జరిగింది.
దీనిపై బెల్లంకొండ సురేష్ మండిపడుతున్నారు. ఈ విషయమై నిర్మాతల మండలి ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాట్లాడుతూ..మేము ఇరుపక్షాల వాదనలు వింటున్నాం. బెల్లంకొండ కంప్లైంట్ తీసుకుని, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నాం అన్నారు. అందుకోసం ఆమెకు నిర్మాతల మండలి ఓ నోటీస్ ను ఇచ్చింది. దానికి సమాధానం వచ్చిన తర్వాత ఈ విషయమై నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. అయితే సమంతకు చెందిన వారు మాత్రం ఆ నిర్మాత సరైన ప్లానింగ్ లేకపోవటంతో ఈ పని చేయవలిసి వచ్చింది..మా దగ్గర వేలీడ్ రీజన్ ఉంది అని చెప్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











