'ఇష్క్' డైరక్టర్ తెలుగులో నెక్స్ట్
నితిన్ కి చాలా కాలం తర్వాత హిట్ ఇచ్చిన డైరక్టర్ విక్రమ్ కుమార్. ఇష్క్ టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. మార్నింగ్ షోకే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో బెల్లంకొండ సురేష్ ఆ దర్శకుడుతో సినిమా చేయాలని టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాడని సమాచారం. ఇక విక్రమ్ కుమార్ గతంలో తెలుగులో శ్రియను పరిచయం చేస్తూ ఇష్టం సినిమాని ఉషాకిరణ్ బ్యానర్ లో చేసారు.
అలాగే ఆ మధ్య హిందీలో మాధవన్ తో ఆయన చేసిన 13బి చిత్రం మంచి విజయం సాధించింది. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ ఉన్న దర్శకుడుగానే కాక స్క్రిప్టు వర్కు లోనూ ఆయన తనుకు తానే సాటి అని నిరూపించుకున్నారు. నితిన్ చిత్రం ఇష్క్ కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రొమాన్స్ ని,నవ్వులను పంచుతూ సరదాగా సాగిపోవటం అన్ని వర్గాలని ఆకట్టుకుంటోంది. బెల్లంకొండ విషయానకి వస్తే ఆయన ప్రస్తుతం నందినీ రెడ్డితో సిద్దార్ద,సమంత కాంబినేషన్ లో ఓ చిత్రం చేస్తున్నారు. అలాగే మొన్న సంక్రాంతికి ఆయన చిత్రం బాడీగార్డు విడుదలై మంచి పేరు తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











