కందిరీగ డైరక్టర్ కి బెల్లంకొండ ఎగ్రిమెంట్ ట్విస్ట్
ఇండస్ట్రీలో ఇప్పుడు కందిరీగ డైరక్టర్ కి ఎక్కడలేని క్రేజ్. నిర్మాతలు, హీరోలు అతనిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే అతనికి బెల్లంకొండ సురేష్ తన ఎగ్రిమెంట్ తో ట్విస్టు ఇవ్వనున్నాడు. నిజానికి కందిరీగ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సంతోష్ శ్రీనివాష్ చెప్పిన స్టోరీ లైన్ విని అల్లు అర్జున్ సినిమా చేయటానికి ఆసక్తి చూపుతున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా సంతోష్ శ్రీనివాస్ కి మూడో సినిమానే కానుందని తాజా సమాచారం. కందిరీగ నిర్మాత బెల్లంకొండ సురేష్ కు రాసిన ఎగ్రిమెంట్ ప్రకారం రెండో సినిమా ఆయనకే చేయాలి. ఈ నేపధ్యంలో ఆయన వెంటనే సీన్ లోకి వచ్చి తన రెండో సినిమా గురించి అడిగి శ్రీనివాస్ ని ఇరుకున పెట్టాడని చెప్పుకుంటున్నారు.
అప్పటికి కందిరీగ టైమ్ లో సినిమా వచ్చిందే అవకాసం అనుకుని ఎగ్రమెంట్ మీద సైన్ చేసేసి ఇప్పుడు ఇరుక్కుపోయాడంటున్నారు. అలాగే ఏ హీరోతో సినిమా చేయాలనేది ఇప్పటివరకూ బెల్లంకొండ సురేష్ తేల్చలేదు. రవితేజ అయితే తన వద్ద కథ ఉందని శ్రీనివాస్ చెప్పినట్లు తెలుస్తోంది. మరో ప్రక్రక్క అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత వాసు వర్మ చిత్రం, సెల్వరాఘవన్ తో కమిట్ మెంట్ ఉన్నాయి. దాంతో శ్రీనివాస్స్ కూడా అంత గ్యాప్ కన్నా నెక్ట్స్ చిత్రం ఈలోగా విడుదల చేసి హిట్టు కొట్టేయటమే బెస్ట్ అని భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











