పవన్ 'పంజా'కి అదిరిపోయే న్యూస్
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజాలో బెల్లీ డాన్స్ ని స్పెషల్ గా నిలవనుంది. ఈ నెల 10 వ తేదీన హైదరాబాద్ స్టూడియోలో ఈ డాన్స్ ని అంజలీ లావానియా మీద చిత్రీకరిస్తారు. షీలాకా జవానీ ఫేమ్ గీతా కపూర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. యవన్ శంకర్ రాజా అందించిన సంగీతంతో కూడిన ఫాస్ట్ బీట్ కు అణుగుణంగా ఈ డాన్స్ హైలెట్ గా నిలవనుంది.నైట్ క్లబ్ లో ఈ పాట వస్తుంది. ఇక పవన్‌కళ్యాణ్ పంజా విషయానికొస్తే... బిల్లా వంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను అందించిన తమిళ దర్శకుడు విష్ణువర్థన్ తెలుగు తెరపై సంధిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఇది. నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ ఈ చిత్రానికి నిర్మాతలు. విజయదశమి పండగ సందర్భంగా సినిమా టైటిల్ (పంజా)తో పాటు హీరో ఫస్ట్‌లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో అతని పేరు జాక్సన్ రాబర్ట్ అని తెలుస్తోంది.
ఈ పాత్ర ఓ మాఫియా డాన్ ది కావటంతో ఆ పాత్ర పేరును పవన్ ఫిక్స్ చేసారు. సారాజేన్ డయాస్, అంజలీ లావానియాహీరోయిన్స్ గా చేస్తున్నారు.నిర్మాతలు నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ మాట్లాడుతూ ..పవన్ ఇమేజ్ దృష్ట్యా పవర్‌ఫుల్ టైటిల్ నిర్ణయించాం. కోల్‌కత నేపథ్యంలోని యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. న్యూలుక్ ఉన్న సినిమా. క్రిష్, త్రీఇడియట్స్..చిత్రాలకు స్టంట్స్ కూర్చిన శ్యామ్ కౌశల్ అద్భుత యాక్షన్‌నిచ్చారు. 2పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు నడుస్తున్నాయి. దీపావళికి ట్రైలర్, నవంబర్‌లో ఆడియో, డిసెంబర్‌లో సినిమా విడుదల చేస్తాం అన్నారు.


Click it and Unblock the Notifications











