టాప్ హీరోతో భాగ్యశ్రీ అఫైర్? ఈసారి డేటింగ్ ఎవరితో అంటే?
సినీ పరిశ్రమలో ఎప్పుడు ఏ హీరోయిన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కొంతమంది కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో ఏళ్ళు అయినప్పటికీ సరైన బ్రేక్ లేకుండా ఉంటారు. ఇంకొందరు అయితే అంచలంచెలుగా ఎదుగుతారు. ఇక మరి కొందరు ప్లాప్స్ పడినా కూడా సాలిడ్ ఆఫర్స్ అందుకుంటారు. అయితే ఇలాంటి హీరోయిన్స్ తెలుగు సినిమా దగ్గర కూడా కనిపిస్తారు.
కాగా ఇటీవల తెలుగులో ఒక డిజాస్టర్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే అని చెప్పవచ్చు. మాస్ మహారాజ రవితేజ అలాగే దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ విడుదల ముందు వరకు కూడా ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో భాగ్యశ్రీ తెలుగు యువతని కట్టి పడేసింది. కాగా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది కానీ ఆమెకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీగా చేతినిండా ఏ హీరోయిన్‌కు లేనంతగా 14 సినిమాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రభాస్, రామ్ పోతినేని, దుల్కర్, నితిన్ లాంటి యువ హీరోలతో రొమాన్స్ చేయడానికి సిద్దంగా ఉంది. ప్రస్తుతం రెండు, మూడు షిఫ్టుల్లో ఈ అందాల భామ పనిచేస్తూ క్షణం తీరికలేకుండా ఉందని చెబుతున్నారు.
బిజీగా మారి భారీ ఆఫర్స్ అందుకొంటున్న ఈ బ్యూటీపై పలు రూమర్స్ కూడా రాకపోలేదు. ఇలా టాలీవుడ్‌లో మిస్టర్ బచ్చన్ సమయంలో రవితేజకి సన్నిహితంగా ఉంటున్నారని పలు పుకార్లు వినిపించాయి కానీ ఇపుడు ఇదే హీరోయిన్ పై మరో టాప్ హీరోతో డేటింగ్ లో ఉంది అంటూ ఫ్రెష్ రూమర్స్ మొదలయ్యాయి. కాగా ఆ హీరో కూడా ఇపుడు తనతో వర్క్ చేస్తున్న సినిమాల్లో ఒక హీరోనే అన్నట్టు తెలుస్తుంది.
మరి ఇంట్రెస్టింగ్ గా భాగ్యశ్రీ ఏ హీరోతో సినిమా చేస్తుంటే ఆ సినిమా హీరోతో ఈ వార్తలు వస్తుండడం గమనార్హం. అయితే ప్రస్తుతం కూడా తాను వర్క్ చేస్తున్న మరో హీరోతో ఈమె డేటింగ్ లో ఉంది అనే మాట తెలుగు సినిమాలో వైరల్ అవుతుంది కానీ ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇవన్నీ గాలి వార్తలే అని సినీ వర్గాలు కొట్టి పడేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











