నా గుండెలో ఆయనే... పెళ్లిపై భాగ్యశ్రీ భోర్స్ షాకింగ్‌గా...
టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో స్టార్ హీరోలు, హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు ప్రేమలో పడుతున్నారు. కొందరు తమ ప్రేమను సీక్రెట్‌గా ఉంచుతుంటే మరికొందరు మాత్రం బయటపెట్టేస్తున్నారు. ఇంకొందరైతే తమ డేటింగ్‌లో ఉన్నట్లుగా హింట్ ఇస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి రామ్ పోతినేని- భాగ్యశ్రీ బోర్సేలు చేరారు. గత కొద్దినెలలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలకు బలం చేకూరేలా హాట్ కామెంట్స్ చేశారు భాగ్యశ్రీ. ఈ వివరాల్లోకి వెళితే..
నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకా
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సేలు జంటగా నటించిన చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. మహేశ్ బాబు పాచిగోళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషిస్తున్నారు. రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. సిద్ధార్ధ నూని, జార్జ్ సీ విలియమ్సన్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. వివేక్- మెర్విన్‌లు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

రామ్‌తో భాగ్యశ్రీ డేటింగ్?
మిస్టర్ బచ్చన్‌తో తెలుగువారిని పలకరించిన భాగ్యశ్రీ బోర్సే ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్నారు. కింగ్డమ్, కాంత సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రా కింగ్ తాలూకా మూవీలో రామ్ పోతినేనితో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నారు భాగ్యశ్రీ. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో రామ్, భాగ్యశ్రీల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.
ఆ పోస్టులకు అర్ధం అదేనా?
వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోన్న ఫోటోలు, వీడియోలలోని లోకేషన్స్, భవనాలు, బ్యాక్‌గ్రౌండ్స్ అన్ని ఒకేలా ఉండటంతో వీరిద్దరూ పక్కపక్కనే ఉన్నారా? అంటూనెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల భాగ్యశ్రీ చేతి వేలికి ఉంగరం ఉండటంతో రామ్ పోతినేనితో ఆమెకు సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగిందా అన్న ఊహాగానాలు వినిపించాయి. ఇక ఈ సినిమా కోసం రామ్ తొలిసారిగా రైటర్‌గా మారిన సంగతి తెలిసిందే. చూపుతో నాలోన పుట్టిందే.. ఏదో వింతగా గుండెలో చేరిందేంటూ రాసిన లిరిక్స్.. భాగ్యశ్రీని ఉద్దేశించేనని కామెంట్స్ పెడుతున్నారు.
ఆయన కింగ్ ఆఫ్ హార్ట్స్
తాజాగా రామ్ పోతినేనిపై తన ప్రేమను ఇన్‌డైరెక్ట్‌గా బయటపెట్టారు భాగ్యశ్రీ బోర్సే. మరో రెండ్రోజుల్లో ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో విశాఖలో గ్రాండ్‌గా మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాగ్యశ్రీ మాట్లాడుతూ... నా చిన్నిగుండెలో చాలా ఆశలతో ఇక్కడికి వచ్చాను. మీ అందరి ప్రేమకు చాలా థ్యాంక్స్. మీకొక విషయం చెప్పాలి.. అభిమానులను ప్రేమించే వ్యక్తి, వారి కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి. వారికోసం సినిమా తీసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆ ఒక్కరే.. ఏమంటారు? కింగ్ ఆఫ్ హార్ట్స్ అంటారు. ఆయనే రామ్ అంటారు అని భాగ్యశ్రీ పేర్కొన్నారు.
ఐ లవ్ యూ రామ్
ఈ రోజంతా ఆయన గురించే, మీకు దక్కాల్సిన ప్రేమంతా దక్కాలి.. మీకు థ్యాంక్స్ రామ్.. మీరు బెస్ట్. మీ గెలుపు, ఓటమి... మీరు ఎంత ఉన్నతస్థాయిలో ఉన్నా, మాతో ఎప్పుడూ ఉంటారు. మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం. వీ లవ్ యూ రామ్ అని భాగ్యశ్రీ వ్యాఖ్యానించారు. ఆమె స్టేజ్ మీద మాట్లాడుతున్నంతసేపు.. రామ్ నవ్వుతూ, సిగ్గుపడుతూ కనిపించారు. ఆ వెంటనే యాంకర్ సుమ వచ్చి.. మాకు పప్పన్నం ఎప్పుడు పెడతారని ప్రశ్నించింది. ఇప్పట్లో కాదని భాగ్యశ్రీ ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం భాగ్యశ్రీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు దీనితో తేలిపోయిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











