కొత్త పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్.. ఆమె కావాలనే తప్పుకుందా?

'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయమై.. టాలీవుడ్‌లో హీరోగా గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్నాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. ఆ తర్వాత కూడా వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టి తన మార్కెట్‌ను భారీగా పెంచుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం విజయ్ హిట్ వాసన చూడలేదు. అయినా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

విజయ్ దేవరకొండ ఇటీవలే 'ది ఫ్యామిలీ స్టార్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల కోసం పోరాటం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ యంగ్ హీరో తన తదుపరి సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు. వాస్తవానికి ఈ యంగ్ హీరో తన 12వ సినిమాను 'జెర్సీ' ఫేం గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు దీన్ని మొదలుపెట్టనున్నాడు.

Bhagyashri Borse Fix for Vijay Devarakonda and Gowtam Tinnanuri Movie

గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ చేసే సినిమాకు సంబంధించి ఓ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో పోలీస్ యూనిఫామ్‌లో ఓ వ్య‌క్తి ముఖానికి ముసుగు ధ‌రించి ఉండ‌టం ఆస‌క్తిని రేకెత్తించింది. అలాగే, నేను ఎక్క‌డివాడినో, ఎవ‌రిని మోసం చేశాను తెలియ‌దు అంటూ పోస్ట‌ర్‌పై రాశారు. అలాగే, బ్యాగ్రౌండ్ కూడా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు.

విభిన్నమైన కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించే హీరోయిన్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది బాలీవుడ్, టాలీవుడ్ భామల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీలను తీసుకున్నారు.

Bhagyashri Borse Fix for Vijay Devarakonda and Gowtam Tinnanuri Movie

విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రాబోయే ఈ చిత్రం నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆమె నిజంగానే ఈ చిత్రం నుంచి బయటకు వచ్చేసిందట. ఇప్పుడు ఇందులో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సేను ఫైనల్ చేశారని తెలిసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందని టాక్.

ఇదిలా ఉండగా.. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ , ఫార్ఛ్యూన్ ఫోర్ ప‌తాకాల‌పై నాగ‌వంశీ , సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి కోలీవుడ్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందించబోతున్నాడు. మొత్తానికి ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X