Bhagyashri Borse: 6 సినిమాలతో భాగ్యశ్రీ భోర్సే‌కు ఫుల్ డిమాండ్.. ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ ఎంటో తెలుసా?

చిత్ర పరిశ్రమలో రాత్రికి రాత్రే స్టార్లుగా మారిన వారు అత్యంత అరుదు. అలాంటి అదృష్టాన్ని సంపాదించింది. మరాఠీ ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే. తొలి ప్రయత్నం నిరాశ పరిచినప్పటికీ స్టార్ హీరోయిన్‌ని మించిన క్రేజ్ సంపాదించి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది భాగ్యశ్రీ. మొదటి సినిమా దారుణ పరాజయం సాదించినప్పటికీ ఎన్నో ఆఫర్లు అందుకుని దూసుకెళ్తోంది ఈ భామ.

చదువు పూర్తి చేసిన తర్వాత హిందీలో యారియాన్ -2లో భాగ్యశ్రీ నటించారు. అలాగే మోడల్‌గా దేశంలోని టాప్ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగానూ వ్యవహరించారు. ఈ దశలో మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్‌లో భాగ్యశ్రీకి హీరోయిన్‌గా అవకాశం దక్కింది. ఈ సినిమాలో ఆమె అందాలను అద్భుతంగా చూపించి అంచనాలు పెంచేశారు దర్శకుడు హరీష్ శంకర్. టీజర్, ట్రైలర్, పోస్టర్లలో భాగ్యశ్రీ నడుము, నాభి అందాలతో భాగ్యశ్రీ కుర్రాళ్లకు పిచ్చెక్కిపోయింది.

bhagyashri borse s remuneration for her next movies here s the details

గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15న రిలీజైన మిస్టర్ బచ్చన్‌కు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే భాగ్యశ్రీకి ఆఫర్లు క్యూకట్టాయి. తెలుగు సినిమా సహా తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్స్ ఈమెకి వస్తున్నాయి అని ఆ మధ్య టాక్ వచ్చింది. హిందీలో బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ లో నటించి అక్కడ హిట్ అందుకుంది భాగ్యశ్రీ.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, రాణా దగ్గుబాటి నటిస్తున్న కాంతలో.. విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్‌లోనూ.. రామ్ పోతినేని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న మరో సినిమాలోనూ భాగ్యశ్రీ హీరోయిన్‌గా ఎంపికైనట్లుగా వార్తలు వస్తున్నాయి. అందంతో పాటు డ్యాన్స్ కూడా ఈమెకు అదనపు బలం. ఇక ఓ సినిమా హిట్ అవ్వగానే హీరోయిన్లు పారితోషికాన్ని అమాంతం పెంచేస్తున్నారు. అలాంటిది భాగ్యశ్రీ ఒక్క హిట్ కూడా ఇవ్వకుండానే రెమ్యునరేషన్ పరిధి దాటిపోయిందంటూ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

భాగ్యశ్రీ పారితోషికానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం భాగ్యశ్రీ చేతిలో 6 సినిమాలు ఉన్నాయి. రామ్ పోతినేని , దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలతో ఆమె సినిమాలు చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలోనూ భాగ్యశ్రీ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఇవి కూడా మరో రెండు సినిమాలకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే మొత్తం ఆరు సినిమాలు భాగ్యశ్రీ చేతిలో ఉన్నాయి.

ఆమె దూకుడు చూస్తుంటే మరిన్ని సినిమాలకు కమిటైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం భాగ్యశ్రీ ఒక్కో ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల చొప్పున ఛార్జ్ చేస్తోందట. అంటే ఆరు సినిమాలకు గాను రూ.12 కోట్లను ఆమె తన ఖాతాలో జమ చేసుకోనున్నారు. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్‌లు కథా చర్చల్లో ఉన్నాయి. వీటితో కలిపి ఆమె సినిమాల సంఖ్య 12పైనే ఉంటుందని ఫిలింనగర్ టాక్. అయితే భాగ్యశ్రీ రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్తలపై అధికారికంగా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. కానీ ఈ గణాంకాలు ఇండస్ట్రీలో ఆమె డిమాండ్‌ను చెబుతున్నాయి.

More from Filmibeat

Read more about: bhagyashri borse movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X