నాగ్ ‘భాయ్’ఫస్ట్ లుక్...డైలాగ్స్ టాకేంటి?
హైదరాబాద్ : నాగార్జున నటించిన 'భాయ్' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లు,డైలాగ్స్ రెండు రోజుల క్రితం విడుదలయిన సంగతి తెలిసిందే. వీటిల్లో ఫస్ట్ లుక్ ఓకే అనిపించుకుంది. మాస్ లుక్ అనుకున్న పోస్టర్స్ కిక్ ఇవ్వలేకపోతున్నాయని అభిమానులు అంటున్నారు. అయితే చిత్రంలోని డైలాగ్స్ మాత్రం కేక పెట్టిస్తున్నాయి. దాంతో ఖచ్చితంగా మాస్ ప్రేక్షకులను నచ్చే విధంగా 'భాయ్' సినిమా ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. ఈ డైలాగ్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఫస్ట్ లుక్ డిజైన్స్ పై మరింత శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ చిత్రంలో పాపులర్ అవుతున్న డైలాగులు
"6 వరకే నేను భాయ్.. ఆ తరువాత ప్లే బాయ్"...
"అట్మాస్ఫియర్ వయలేంట్ గా వుందంటే ఫీల్డ్ లోకి భాయ్ ఎంటర్ అయినట్టే" ...
"హైదరాబాద్ లో ఫేమస్ అయినవి రెండే.. ఒకటి ఇరానీ చాయ్.. రెండు ఈ భాయ్"
ఈ చిత్రానికి పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీచాగోపాధ్యాయ్ హీరోయిన్. యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు . ఈ చిత్రం థాయ్‌లాండ్‌లో షూటింగ్ చేశారు. యూరప్‌లోనూ రెండు పాటల్ని చిత్రీకరించారు. ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ మెయిన్ హీరోయిన్. హంసానందిని, కామ్న జఠ్మలాని, నథాలియా కౌర్ గెస్ట్ అప్పియరెన్స్‌లు చేశారు.
ఇక సంగీతం గురించి చెప్తూ...సెప్టెంబర్ 1న పాటల్ని విడుదల చేస్తాం. దేవీ కనికరిస్తే. అతను చివరి వరకు ఏదో బెస్ట్ అవుట్‌పుట్‌ను తీసుకుని రావాలని దిద్దుతూనే ఉంటాడు. ప్రజలందరూ ఎప్పుడు సంతోషంగా సినిమాను చూస్తామంటారో అప్పుడే మేం సినిమాను విడుదల చేస్తాం. ప్రతిదానికీ కాలం సమాధానం చెప్తుంది. సినిమాను విడుదల రోజే ఆన్‌లైన్‌లో విడుదల చేసే పద్ధతి లో బడ్జెట్ సినిమాలకు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాకు మంచి ఫలితాన్నిస్తుంది అని అన్నారు.
"ఇందులో నా పాత్రకు మూడు లుక్స్ ఉంటాయి. హాంకాంగ్‌లో డాన్‌కి రైట్ హ్యాండ్‌గా పనిచేసేటప్పుడు ఓ లుక్, పాతబస్తీకి పనిమీద వచ్చినప్పుడు ఓ లుక్, ఎప్పుడో విడిపోయిన ఫ్యామిలీని కలుసుకున్నప్పుడు మరో లుక్ ఇందులో ఉంటుంది అంటూ నాగార్జున తన తాజా చిత్రం భాయ్ లో తను కనపడే విధానం గురించి చెప్పుకొచ్చారు.
దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ... 'రెండున్నర గంటలు సంపూర్ణ హాస్యంతో ప్రేక్షకుల్ని అలరించే చిత్రమిది. అందరికీ అభయమిచ్చే 'భాయ్'గా నాగార్జున నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది. రొమాన్స్‌తో పాటు వినోదాన్ని పండించడంలో నాగార్జునగారు ఎంతో ప్రత్యేకతను కనబరుస్తారు. ఇందులో ఆయన శైలి వినోదం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. నాగ్-రిచా గంగోపాధ్యాయ జోడీ కన్నులపండువగా వుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని చెల్లెలి సెంటిమెంట్ ప్రేక్షకుల హృదయాల్ని కట్టిపడేస్తుంది. గతంలో నాగార్జున సిస్టర్ సెంటిమెంట్‌తో చేసిన 'హలో బ్రదర్' 'సీతారామరాజు' 'ఆజాద్' చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సెంటిమెంట్‌ను ఈ సినిమా పునరావృతం చేస్తుంది' అన్నారు.


Click it and Unblock the Notifications











