నిర్మాతను మార్చిన శ్రీనివాసరెడ్డి

శ్రీకాంత్‌ను హీరోగా ఎంచుకుని, దానికి 'భలే ఛాన్సులే' అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు. అయితే తాజాగా ఆ ప్రాజెక్టు నుంచి శ్రీనివాసరెడ్డి తప్పుకున్నాడని తెలిసింది. ప్రతి అంశంలోనూ శ్రీధర్ మితిమీరిన జోక్యం చేసుకుంటూ వుండటం వల్ల తనకు స్వేచ్ఛ వుండదని శ్రీనివాసరెడ్డి భావించాడనీ, అందుకే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడనీ ఫిల్మ్ నగర్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. మరో ప్రక్క అంతలా పరిశ్రమలో పాతుకుపోయిన నిర్మాత తో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శ్రీనివాసరెడ్డి అట్లా బిహేవ్ చెయ్యికుండా ఉండాల్సింది అని కొందరు అంటున్నారు.
ఆమధ్యన కూడా వీరూపోట్ల అనే రచయితతో సినిమా చేస్తానని ప్రకటించిన శ్రీధర్ తరువాత సినిమా చెయ్యిలేదు. తర్వాత ఆ రచయితకు సినిమా రాలేదు.కారణాలు యేమైనా ఆయన ప్రతీదాంట్లో కలుగచేసుకుంటాడనే దానికన్నా అన్ని కోణాల్లో భాద్యత వహిస్తాడని పాజిటివ్ గా తీసుకుంటే ప్రాజెక్టు మెటీరియలైజ్ అయ్యేది అంటున్నారు.అలాగే నిర్మాతగా అన్ని విషయాల్లోనూ తను స్వయంగా పాలుపంచుకోవటం దర్శకులకు కొంచెం బాధ కలిగించినా అవుట్ పుట్ డబ్బులు పెట్టే ఆయన అనుకున్నట్లుగా రావాలనుకోవటం సమంజసమే అనేది కొందరి వాదన.
ఇప్పుడు ఆ సినిమాను కల్పనా ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థకు చేయడానికి అంగీకరించాడు శ్రీనివాసరెడ్డి. ఆ సంస్థ ఇటీవలే గోపిక, రిషి, సమ్రాట్ కాంబినేషన్‌తో 'వీడు మామూలోడు కాదు' సినిమాను నిర్మించింది. హీరో మాత్రం శ్రీకాంతే.అంటే భలే ఛాన్సు ని వేరే వారు అందుకోబోతున్నారన్నమాట.


Click it and Unblock the Notifications











