చాలా నీచంగా ఉంటుంది..... నో చెప్పిన మహేష్ బాబు?

By Bojja Kumar

Recommended Video

చాలా నీచంగా ఉంటుంది.. నో.. చెప్పిన మహేష్ బాబు !

స్టార్ హీరోల సినిమాలంటే భారీ బడ్జెట్, భారీ తారాగణం తప్పనిసరి. ఆయా స్టార్లు పుచ్చుకునే రెమ్యూనరేషన్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల పరంగా వర్కౌట్ అయ్యేలా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తప్పకుండా చేరుస్తారు. ఇలాంటి అంశాల్లో భారీ యాక్షన్ సీన్లు, ఐటం సాంగులను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఒక్కోసారి సినిమా స్టోరీ పరంగా కాస్త వీక్ ఉన్నా.... యాక్షన్ సీన్లు, ఐటం సాంగులు సినిమాను గట్టెక్కిస్తాయని కొందరు నిర్మాతల నమ్మకం. అందుకే సినిమాలో వాటి అవసరం లేకున్నా దర్శకులను బలవంతం చేసి పెట్టిస్తూ ఉంటారు.

మహేష్ బాబు మూవీలో

మహేష్ బాబు మూవీలో

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ‘భరత్ అను నేను' అనే చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో ఐటం సాంగ్ విషయంలో దర్శక నిర్మాతలు, హీరో మహేష్ బాబు మధ్య ఆసక్తికర చర్చసాగినట్లు తెలుస్తోంది.

మహేష్ అభిమానులు తప్పకుండా కోరుకునే అంశాల్లో అదీ ఒకటి

మహేష్ అభిమానులు తప్పకుండా కోరుకునే అంశాల్లో అదీ ఒకటి

మహేష్ బాబు అభిమానులు తమ హీరో సినిమాల్లో తప్పకుండా కోరుకునే అంశాల్లో ఐటం సాంగ్ కూడా ఒకటి. మహేష్ సినిమాలకు మహిళా అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. మహేష్ బాబు గత చిత్రాల్లో ఐటం సాంగ్స్ కూడా ప్రధాన భూమిక పోషించిన సంగతి తెలిసిందే.

 ‘భరత్ అను నేను'లో వద్దని చెప్పి మహేష్ బాబు

‘భరత్ అను నేను'లో వద్దని చెప్పి మహేష్ బాబు

అయితే ప్రస్తుత మూవీ ‘భరత్‌ అనే నేను' సినిమా విషయంలో మహేష్ బాబు తన అభిప్రాయం మార్చుకున్నారట. ఈ చిత్రంలో ఎలాంటి ఐటం సాంగులు కానీ, ప్ర్యతేక గీతాలు ఉండకూడదని దర్శకుడికి సూచించారట.

నీచంగా ఉంటుంది

నీచంగా ఉంటుంది

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి సెకండాఫ్‌లో ప్ర్యతేక గీతం ఉంటే సినిమా డిస్ర్టబ్‌ అవుతుందని, అంతే కాకుండా ఒక సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐటం సాంగ్ చాలా నీచంగా ఉంటుంది అనేది మహేష్ బాబు అభిప్రాయ పడ్డట్లు తెలుస్తోంది.

ఛీ కొట్టే అవకాశం ఉంది

ఛీ కొట్టే అవకాశం ఉంది

ఐటం సాంగు పెట్టడం వల్ల సినిమా మొత్తం మీద ఎఫెక్టుపడి ఛీ కొట్టే అవకాశం ఉందని.... మనం ఒక మంచి సినిమా చేస్తున్నపుడు ఇలాంటి అనవసర అంశాలను పక్కన పెట్టేయడమే మంచిదని మహేష్ బాబు సూచించారట.

 ముఖ్యమంత్రిగా మహేష్ బాబు

ముఖ్యమంత్రిగా మహేష్ బాబు

ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారు. ఇలాంటి పాత్ర చేయడం మహేష్ బాబు కెరీర్లోనే తొలిసారి. సినిమా టాకీపార్ట్ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. రెండు పాటలు, ఫైట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి.

ఏప్రిల్‌లో

ఏప్రిల్‌లో

ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ సీజన్ టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని విడుదల ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ మహేశ్‌కు జోడీగా నటిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు.

 మహేష్‌ కెరీర్‌లో ఇది మరో పవర్‌ఫుల్‌ మూవీ

మహేష్‌ కెరీర్‌లో ఇది మరో పవర్‌ఫుల్‌ మూవీ

నిర్మాత డివివి దానయ్య గతంలో మీడియాతో మాట్లాడుతూ '' మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో మా బేనర్‌లో సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. మహేష్‌ కెరీర్‌లో ఇది మరో పవర్‌ఫుల్‌ మూవీ. అలాగే మా బేనర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా అవుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 27న సమ్మర్‌ స్పెషల్‌గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

నటీనటులు, తెర వెనక

నటీనటులు, తెర వెనక

సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X