లేటెస్ట్, భరత్ అనే సినిమా సీక్వెల్ ఉండబోతోంది, కొరటాల దర్శకత్వం!
కొరటాల శివ దర్శకత్వం వహించిన భరత్ అనే నేను సినిమం విడుదలై అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. అందరి ప్రశంసలు అందుకుంటూ పెద్ద మొత్తంలో వసూళ్లను రాబడుతోంది. మహేష్, కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా హిట్ సినిమాగా నిలిచింది. కొరటాల మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
సామాన్యులకు, దేశ ప్రజలందరికీ అవసరమైన చాలా సమస్యలను ఈ సినిమాలో చర్చించడం జరిగింది అందుకే హిందీ, ఇతర భాషల్లో కూడ చిత్రాన్ని అనువదిస్తామని అలాగే సీక్వెల్ రూపొందించాలనే ఆలోచన బలంగా ఉందని తాజా ఇంటర్వ్యూ లో కోరటాల శివ అన్నారు. ఈ సినిమా ఎప్పుడు ? ఎవరితో ఉంటుంది అన్నదానిపై క్లారిటి లేదు.

ఈ సీక్వెల్ లో భరత్ రెండోసారి ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏం జరిగింది, ఎలాంటి రాజకీయపరమైన మార్పులు తీసుకొచ్చాడనేవి ఈ సినిమాలో ప్రదానంగా చర్చించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొరటాల తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఇంకొంత సమయం ఉంది.


Click it and Unblock the Notifications











