100 మంది మాస్టర్లను తొక్కి .. జానీ మాస్టర్‌ బాగోతం బయటపెట్టిన స్టార్ కొరియోగ్రాఫర్

జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండ్రోజులుగా అజ్ఞాతంలో ఉంటున్న జానీ కోసం హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో గోవాలో జానీ మాస్టర్‌ను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మరో కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్. ఆ వివరాల్లోకి వెళితే.

తెలుగులో ఓ టాప్ ఛానెల్‌లో ప్రసారమైన డ్యాన్సింగ్ షో సమయంలో ఓ యువతి జానీ మాస్టర్‌కు పరిచయమైనట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో తెలిపారు. కొద్దిరోజుల్లోనే ఆమెకు తన వద్ద అసిస్టెంట్‌గా అవకాశం కల్పించాడు జానీ. అయితే ముంబైలోని ఓ హోటల్‌లో జానీ ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తానని యువతిని హెచ్చరించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

Bhaseer Master SHOCKING Comments on choreographer jani master here s the details

మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని వేధించడంతో పాటు షూటింగ్ సమయంలో కేరవ్యాన్‌లోకి వచ్చి ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడని వెల్లడించారు. అర్థరాత్రుళ్లు ఆమె ఫ్లాట్‌కు వెళ్లి కోరిక తీర్చాలని వేధించినట్లుగా ఎఫ్ఐఆర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం జానీ మాస్టర్ కేసులో మరిన్ని ఆధారాలు , వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది.

బాధితురాలికి ఓ స్టార్ హీరో వ్యక్తిగతంగా అండగా నిలిచారని, ఓ పెద్ద కంపెనీలో ఆమెకు అవకాశం ఇప్పించినట్లు తెలిపింది. జానీ మాస్టర్ వాంగ్మూలం నమోదు చేశామని, నిజ నిర్ధారణ జరిగిన తర్వాత యాక్షన్ ఉంటుందని వెల్లడించింది. జానీ మాస్టర్ వ్యవహారంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. అమ్మాయిలు ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలని.. తాను బాధితురాలితో కొన్నిరోజులు పనిచేసినట్లు అనసూయ తెలిపారు. కానీ ఆ అమ్మాయి జరిగినది దాచిపెట్టిందని, ఆమెకు తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని .. ఫిలిం ఛాంబర్‌కు అనసూయ థ్యాంక్స్ చెప్పారు.

ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌పై సంచలన ఆరోపణలు చేశారు మరో కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్. ఆట సందీప్, హరనాథ్ మాస్టర్ సహా 100 మంది కొరియోగ్రాఫర్లను జానీ తొక్కేశాడని ఆరోపించారు. పర్సనల్‌గా జానీ మాస్టర్‌తో తనకు వివాదాలు లేవని, కేవలం యూనియన్ గొడవలేనని చెప్పారు. జానీ మాస్టర్ ఓ ప్రెస్‌మీట్ పెడితేనే అన్నింటికి తెరపడుతుందని బషీర్ చెప్పారు. బాధితురాలికి అన్ని రకాలుగా మా తెలంగాణ డ్యాన్సర్స్ యూనియన్ నుంచి మద్ధతు ఉంటుందన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లను బానిసల మాదిరిగా చూడొద్దని బషీర్ మాస్టర్ సూచించారు. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది.. ఎవడి పొట్టా కొట్టొద్దని, అలాంటొళ్లు బాగుపడ్డ దాఖలాలు లేవని బషీర్ చెప్పారు.

More from Filmibeat

Read more about: jani master tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X