»   » హీరో అక్రమ సంబంధం విషయం, ఆయన భార్యకు చెప్పేసింది, అందుకే

హీరో అక్రమ సంబంధం విషయం, ఆయన భార్యకు చెప్పేసింది, అందుకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి‌: రీసెంట్ గా మలయాళీ హీరో హీరోయిన్లు దిలీప్, కావ్య మాధవన్లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యిన సంగతి తెలిసిందే. మొన్న శుక్రవారం ఉదయం కేరళలోకి ఓ హోటల్ లో వివాహం చేసుకున్నారు. అతికొద్ది మంది సన్నిహితులను మాత్రమే తమ పెళ్లికి ఆహ్వానించారు. గతకొంతకాలంగా వీరిద్దరిపై సినీ ఇండస్ట్రీలో అనేక రూమర్లు చక్కర్లు కొట్టాయి. వీటికి బ్రేక్ పడిందనుకుంటున్న సమయంలో మరో విషయం బయిటకు వచ్చింది.

ఇక దిలీప్ మొదటి భార్య మంజు వారియర్ తో డైవర్స్ కు అప్లై చేయటానికి కారణం ... మరో మళాయళి హీరోయిన్ భావన అని బయిటకు వచ్చింది. ఆమె వల్లే...దిలీప్ మొదటి భార్యతో విడిపోయి, ఇప్పుడు రెండో పెళ్లికి సిద్దపడ్డారంటున్నారు.

అయితే భావన చేసిందేమిటంటే..నిజం చెప్పటమేనట. భావన..దిలీప్ మొదట భార్య మంజు వారియర్ క్లోజ్ ఫ్రెండ్స్ . దాంతో దిలీప్ , కావ్య మాధవ్ మధ్య ఇల్లీగల్ రిలేషన్ ఉందని ఆమె చేరవేసిందట. ఈ నేపధ్యంలో మొదట గొడవ ప్రారంభమై చివరకు అది విడాకులు, రెండో పెళ్లి దాకా దారితిసిందిని మళయాళి మీడియా అంటోంది.

గుర్తుందా ..భావన తెలుగులో

గుర్తుందా ..భావన తెలుగులో

భావన అనగానే ఎక్కడో విన్న పేరే అనుకుంటున్నారా..అవును..మన తెలుగు హీరో గోపీచంద్ సరసన 'ఒంటరి', నితిన్ తో 'హీరో', శ్రీకాంత్ సరసన 'మహాత్మ' చిత్రంలో నటించిన భావన గుర్తుండే ఉంటుంది. ఆమె ఈ డైవర్స్ కు కీలక సూత్రధారి అంటున్నారు.

దూరం పెట్టింది

దూరం పెట్టింది

భావన ద్వారా తన భర్త రిలేషన్ విషయం విన్న మంజు...నిలదీసిందిట. ఈ విషయమై దిలీప్ తేలు కుట్టిన దొంగలా సైలెంట్ అయ్యిపోయాడుట. సరిగ్గా రెస్పాండ్ కాలేదట. . తన నమ్మకాన్ని కూలదోసాడని మంజు ఫీలై..దిలీప్ ని ఆ రోజు నుంచి దూరం పెట్టడం మొదలెట్టింది.

ఆమె మాటకే నా కన్నా ఎక్కువ

ఆమె మాటకే నా కన్నా ఎక్కువ

ఓ స్దితిలో దిలీప్...తన మాజీ భార్య మంజుని ...నీకు నీ ఫ్రెండ్ భావన ఎక్కువా..నేను ఎక్కువా అని నిలదీసాడట. నా మాట కన్నా ఆమె మాటే నీకు ఎక్కువ . అందుకే ఆమె మాట నమ్మి నన్ను దూరం పెట్టావు అని గొడవ చేసాడట. అది చిలికి చిలికి గాలి వానగా మారిందని చెప్తోంది మళయాళి మీడియా.

వెనకపడటానికి కారణం ఆ హీరోనే

వెనకపడటానికి కారణం ఆ హీరోనే

ఈ మలయాళ భామ తన మాతృభాష మలయాళంతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మలయాళంలో ఒకట్రెండు చిత్రాలు మాత్రమే భావన చేతిలో ఉన్నాయి. ఈ ముద్దుగుమ్మకి అవకాశాలు తగ్గడానికి కారణం ఈ హీరో దిలీప్ అని చెప్పుకుంటారు.

అందుకే దిలీప్ అలా చేసాడు

అందుకే దిలీప్ అలా చేసాడు

దిలీప్ కి భావన మీద ఎందుకు అంత కోపం?.. ఆ విషయంలోకి వస్తే... ఆ మధ్యకాలంలో వ్యక్తిగత వ్యవహారం పరంగా దిలీప్ వార్తల్లో నిలిచాడు. దిలీప్, అతని భార్య మంజు వారియర్ ఆ మధ్య విడాకులు తీసుకున్నారు. ఈ భార్యా, భర్తల వ్యవహారం రసాభాసగా మారింది. కాగా, మంజు వారియర్ కి అండగా భావన నిలబడిందట. అంతేకాకుండా దిలీప్ విషయం మంజు కు చేరవేసిందిట.

కోపంతో భావనని కట్ చేసాడు

కోపంతో భావనని కట్ చేసాడు

తన కాపురంలో చిచ్చు పెట్టిందని... భావన అంటే దిలీప్ కి ఆగ్రహం ఏర్పడిందని మలయాళ పరిశ్రమ టాక్. ఈ కోపంతో భావనకు అవకాశాలు రాకుండా చేస్తున్నాడట దిలీప్. సీనియర్ హీరో కాబట్టి, మలయాళ పరిశ్రమలో దిలీప్ కి బాగానే పలుకుబడి ఉంది. ఆ పలుకుబడిని ఉపయోగించి, భావన కెరీర్ తో దిలీప్ ఆడుకుంటున్నాడని టాక్. ఒకవేళ దిలీప్ గురించి భావన నటీనటుల సంఘంలో ఫిర్యాదు చేస్తే, అప్పుడు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారట.

అంత చిన్న వయస్సులో

అంత చిన్న వయస్సులో

ఇది వింటే ఎవరూ నమ్మరు. దిలీప్, కార్య మాధవన్ తొలి పరిచయం చాలా కాలం క్రితమే అయ్యిందట. కావ్య మాధవన్ కు అప్పుడు ఏడేళ్లు . ఆమె బాలనటిగా చేస్తోంది. దిలీప్ అసెస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్న సినిమాలో ఆమె వేషం వేసింది. అక్కడ వీరి తొలి పరిచయం.

బ్రదర్ అని పిలవమనేవాడ

బ్రదర్ అని పిలవమనేవాడ

అప్పట్లో అంటే ఏడేళ్ల వయస్సు అప్పుడు కావ్య మాధవన్ ...ఇప్పటి భర్త అయిన దిలీప్ ని అంకుల్ అని పిలిచేదిట. అప్పుడు దిలీప్...అలా పిలవద్దు..బ్రదర్ అని పిలవమని చెప్పేవాడట. అలా బ్రదర్ అండ్ సిస్టర్ గా రిలేషన్ మొదలైందిట.

అత్తగారే చెప్పింది

అత్తగారే చెప్పింది

కావ్య మాధవన్ కు ఇది రెండో పెళ్లి . ఆమె మొదటి భర్త నిశ్చల్ చంద్ర. అతనితో 2011లో డైవర్స్ తీసుకుంది. నిశ్చిల్ చంద్ర తల్లి..ఓ సారి ఈ విషయమై మాట్లాడుతూ..తన కుమారుడుతో వివాహం అయ్యాక కూడా దిలీప్ తో రిలేషన్ లో ఉందని ఆరోపించారామె.

అది అబద్దమే

అది అబద్దమే

దిలీప్ తన కుమార్తె పర్మిషన్ తీసుకుని వివాహం చేసుకున్నానని మీడియాతో అన్నాడు. కానీ అది అబద్దం. ఈ విషయంలోనూ మమ్మల్ని మోసం చేసాడు. నా కూతురు మీనాక్షికు ఈ విషయం నామమాత్రంగా అయినా చెప్పలేదు దిలీప్. దిలీప్ మారదు అంది మంజు.

మంజు ప్యాన్స్ ఇలా

మంజు ప్యాన్స్ ఇలా

ఇక దిలీప్, కావ్య వివాహంతో మంజు వైపుకు అందరి అభిమానం టర్న్ అయ్యింది. కావ్య, దిలీప్ ల డ్రామాకు ఇక తెరపడిందని, సానుభూతి చూపెడుతూ...మంజు ని సపోర్ట్ చేస్తూ అబిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఈ విషయమై మంజు మాత్రం పెదవి విప్పటం లేదు.

దుబాయి

దుబాయి

ఇక తమ పెళ్లిపై వస్తున్న వార్తలను,రూమర్స్ ని పట్టించుకునే స్దితిలో లేరు దిలీప్, కావ్య మాధవన్ లు. ఇద్దరూ హానిమూన్ కు దుబాయికి వెల్లిపోయారు. అక్కడ మళయాళి మెగాస్టార్ ముమ్మట్టి వీరికి ఆతిధ్యం ఇస్తున్నారు. తమ పెళ్లి విషయంలో ఎవరి జోక్యం ఇష్టం లేదనన్నట్లు బిహేవ్ చేస్తున్నారీ కొత్త జంట.

ఏది నిజం

ఏది నిజం

నా కుటుంబంలో నెలకొన్న సమస్యలకు కావ్య కారణం కాదు. గత కొద్దిరోజులుగా ఈ పెళ్లి గురించి నేను ఇంట్లో వారితో, నా కుమార్తెతో చర్చించాను. ఇవాళ వారి సమ్మతితో కావ్యని పెళ్లి చేసుకున్నా' దిలీప్ అన్నారు. అయితే ఇందులో నిజం ఎంత అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

ముందే చెప్పేసాడు

ముందే చెప్పేసాడు

దిలీప్‌ వివాహానికి కొన్ని నిమిషాల ముందు ఫేస్‌బుక్‌ ద్వారా కావ్యను తన భార్యగా స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ పెళ్లి గురించి తన మాజీ భార్యతో మాట్లాడినట్లు చెప్పారు. దయచేసి ఈ విషయాన్ని వివాదాస్పదం చేయొద్దని, అందరి ఆశీస్సులు తమకు కావాలని కోరారు.

23 సినిమాల్లో..

23 సినిమాల్లో..

1998లో దిలీప్‌కు మంజు అనే నటితో వివాహమైంది. వీరిద్దరు 2014లో విడిపోయారు. వీరికి ఓ కుమార్తె. కాగా కావ్య గతంలో నిషాల్‌ చంద్ర అనే నటుడ్ని పెళ్లి చేసుకున్నారు. కానీ కొద్దిరోజులకే అతడి నుంచీ విడిపోయారు. దిలీప్‌, కావ్య కలిసి 23 చిత్రాల్లో నటించారు.

సెన్సేషన్

సెన్సేషన్

పెళ్లికి కొద్ది గంటల ముందువరకూ కూడా ఎవరికీ తెలియనివ్వకుండా దిలీప్, కావ్య జాగ్రత్త పడ్డారు. ఒక్కసారే ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో మీడియా ముందు కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దాంతో అక్కడ ఇదో సెన్సేషన్ న్యూస్ అయ్యింది.

అప్పుడే అనుకున్నారు

అప్పుడే అనుకున్నారు

ఇంతకు ముందే దిలీప్, కావ్య జంట.. కేరళలోని గురువాయర్ లో వివాహం చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే దిలీప్ తన కుమార్తె మీనాక్షి ని ఈ వివాహ విషయమై ఒప్పించే విషయం ఇంతకాలం వెయిట్ చేసారట. లేకపోతే ఆరు నెలల క్రితమే ఈ జంట ఒకటయ్యేది.

హడావిడిగా..ప్లాన్

హడావిడిగా..ప్లాన్

చివరి నిముషాల్లో ఓ ప్లానింగ్ ప్రకారం ..దిలీప్ మేనేజర్ నుంచి మీడియాఛానెల్స్ కు ఫోన్స్ వెళ్లాయి. దాంతో మీడియా వారు హడావిడిగా పరుగెత్తుకు వచ్చారు. ఎర్నాకులంలోని వేదాంత హోటల్ లో ఈ వివాహం చోటు చేసుకుంది.

అందుకే అభిమానులు కోపం

అందుకే అభిమానులు కోపం

అభిమానులు ఎవరూ ఈ వివాహం గురించి ఎవరూ ఎక్సపెక్ట్ చేయలేదు. వార్తలు వస్తున్నా నమ్మలేదు. దిలీప్ తన మొదటి భార్య మంజుతో తిరిగి కలుస్తాడని భావించారు. దాంతో మంజు ని అబిమానించేవాళ్లు వాళ్లు చాలా డిజప్పాయింట్ కు గురి అయ్యారు. మంజు వారియర్ మాత్రం దిలీప్ శుభాకాంక్షలు తెలియచేసిందని చెప్తున్నారు.

ఏజ్ కు ఏముంది

ఏజ్ కు ఏముంది

దిలీప్, కావ్య మాధవన్ ఏజ్ గ్యాప్ విషయం ఈ సందర్బంగా హైలెట్ అయ్యింది. దిలీప్ కు వయస్సు 48 సంవత్సరాలు. కావ్య మాధవన్ కు 32 సంవత్సరాలు. ఇద్దరి మధ్యా 16 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉంది. గతంలో దిలీప్ వివాహం చేసుకున్న మంజు వారియర్ కు, దిలీప్ మధ్య పదేళ్లు వయస్సు తేడా ఉంది.

English summary
When Bhavana found out the illegal relationship between Kavya Madhavan and “ Dileep,” she had informed it to her friend Manju Warrier, the wife of Dileep.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu