భీమ్లా నాయక్ డైరెక్టర్ తరువాత సినిమా అతనితోనే.. క్యాన్సిల్ అనుకున్న ప్రాజెక్ట్ మళ్ళీ సెట్స్ పైకి?
రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి నటించిన ఈ సినిమాను అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో స్క్రీన్ ప్లే మాటలు అందించగా దర్శకుడు సాగర్ కే చంద్ర అద్భుతమైన డైరెక్షన్ అందించాడు. అయితే ఈ సినిమాతో దర్శకుడి స్థాయి ఒక్కసారిగా మారిపోయింది. ఇంతకుముందు అతనితో సినిమా చేయడానికి కాస్త వెనుకడుగు వేసినా వారు కూడా ఇప్పుడు సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

మొదట ఆ దర్శకుడిని అనుకుని..
అసలైతే భీమ్లా నాయక్ సినిమాకు మొదట త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా సాగర్ కె చంద్రను అనుకోలేదట. మరొక యువ దర్శకుడికి అవకాశం ఇవ్వాలని అనుకున్నాడు. మెంటల్ మదిలో బ్రోచేవారెవరురా వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ ను సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ అప్పటికే అతను నానితో అంటే సుందరానికి అనే సినిమా చేయడానికి ఒప్పుకోవడంతో భీమ్లా నాయక్ రీమేక్ ఆఫర్ ను క్యాన్సిల్ చేసుకోక తప్పలేదు.

విజయంలో కీలక పాత్ర
ఇక మొత్తానికి సాగర్ కే చంద్ర అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మొదటి చర్చలతోనే బాగా కనెక్ట్ అయిపోయాడు. పూర్తి స్క్రిప్ట్ ఫైనల్ గా సిద్ధమైన తర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అతనికి సపోర్ట్ గా ఉంటేనే మాటలు స్క్రీన్ ప్లే కూడా అందించారు. భీమ్లా నాయక్ సినిమా పర్ఫెక్ట్ గా రావడానికి సాగర్ కె చంద్ర సలహాలు కూడా చాలా ఉపయోగ పడ్డాయి అని త్రివిక్రమ్ సక్సెస్ మీట్ లో చెప్పాడు.

భీమ్లా నాయక్ కంటే ముందు..
ఇక ఫైనల్ గా భీమ్లా నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో సాగర్ కే చంద్ర పేరు ఇండస్ట్రీ లో మారు మ్రోగి పోతోంది. పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ఇద్దరిని కూడా పవర్ ఫుల్ గా చూపించి సాగర్ భీమ్లా నాయక్ సినిమాతో చాలా తన డైరెక్షన్ పవర్ ను చూపించాడు. భీమ్లా నాయక్ అంటే ముందు సాగర్, అయ్యారే అప్పట్లో ఒకడుండేవాడు అనే రెండు సినిమాలు చేశాడు. ఇక ఆ తర్వాత కొందరి హీరోలను సంప్రదించినప్పటికి అతనితో సినిమా చేసేందుకే ఒప్పుకోలేదు.

వరుణ్ తేజ్ తో మళ్ళీ..
ఇక భీమ్లా నాయక్ సక్సెస్ కావడంతో గతంలో ఆగిపోయిన ఒక ప్రాజెక్టు కూడా ఇప్పుడు మళ్ళీ సాగర్ సెట్స్ పైకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం. మెగా హీరో వరుణ్ తేజ్ తో ఒక సినిమా చేయడానికి చర్చలు జరిపిన సాగర్ సెట్స్ పైకి తెచ్చే క్రమంలోనే ఆ ప్రాజెక్టు అనుకోకుండా ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ వరుణ్ తేజ్ అతన్ని పిలిచి మరి ఆగిపోయిన ప్రాజెక్టును మొదలు పెట్టాలని అనుకుంటున్నాడట. ఇక త్వరలోనే ఆ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











