Bheemla Nayak Title Song: పవన్ పాట సీక్రెట్ లీక్.. అది రిలీజ్ చేయడానికే భారీ ఖర్చు

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరింత జోష్‌తో కనిపిస్తున్నాడు. గతంలో కంటే ఇప్పుడు యమ స్పీడుగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' అనే చిత్రంలో నటించిన ఈ మెగా హీరో.. ఇది పట్టాలపై ఉన్న సమయంలోనే మరో మూడు భారీ ప్రాజెక్టులను ప్రకటించాడు. అందులో మలయాళ సూపర్ హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్‌గా 'భీమ్లా నాయక్' అనే సినిమా ప్రత్యేకమైనదనే చెప్పాలి. విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

'భీమ్లా నాయక్' సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పాటు టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. మలయాళంలో 'అయ్యప్పనుమ్ కోషియం'.. ఆధిపత్యం కోసం ఓ పవర్‌ఫుల్ పోలీసు.. లోకల్ డాన్ మధ్య జరిగే పోరుతో తెరకెక్కింది. ఇందులో బీజూ మీనన్ ఎస్సైగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ లోకల్ డాన్‌గా నటించారు. ఇప్పుడిదే కథను తెలుగు పరిస్థితులకు అనుకూలంగా మార్చి 'భీమ్లా నాయక్'గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కల్యాణ్.. లోకల్ డాన్ రోల్‌లో దగ్గుబాటి రానా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఇక, దీన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Bheemla Nayak Makers Spent Rs 40 Laks for Title Song

పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని 'భీమ్లా నాయక్' యూనిట్ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ పాట ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ సాంగ్‌ను రామజోగయ్య శాస్త్రి రచించగా.. శ్రీకృష్ణ పృథ్వీ చంద్ర, రామ్ మిరియాలతో కలిసి థమన్ స్వయంగా ఆలపించాడు. ఆరంభంలో భీమ్లా నాయక్ చరిత్రను చెబుతూ దర్శనం మొగలయ్య బుర్రకథలా చెప్పాడు. ఇక, ఈ పాటలో లిరిక్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయనే చెప్పాలి. అలాగే, కంపోజీషన్, పాడిన విధానం కూడా చాలా కొత్తగా ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేసింది 'భీమ్లా నాయక్' యూనిట్.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక, తాజాగా ఈ పాట గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. పుట్టినరోజున విడుదలైన కవర్ సాంగ్‌ను షూట్ చేయడం కోసం చిత్ర యూనిట్ దాదాపు రూ. 40 లక్షలు ఖర్చు చేసిందట. ఈ న్యూస్ తెలిసిన తర్వాత అందరూ షాక్‌కు గురవుతున్నారు. అందుకు అనుగుణంగానే ఈ పాట పిక్చరైజేషన్ అదిరిపోయింది. ఇక, సినిమాలో ఒరిజినల్ వెర్షన్ మరోలా ఉండబోతుందన్న మాట.

భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న 'భీమ్లా నాయక్' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక, కొద్ది రోజుల క్రితం ఈ మూవీ నుంచి విడుదలైన గ్లిమ్స్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. అదే సమయంలో మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X