Bheemla Nayak :పవన్ అభిమానులకు శుభవార్త.. ఒటీటీ విడుదలకు రంగం సిద్దం.. ఎప్పటి నుంచంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్' గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 'భీమ్లా నాయక్' మొదటి ఆట నుంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. మొదటి మూడు రోజులు అద్భుతమైన కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం సోమవారం కలెక్షన్స్ లో కాస్త డ్రాప్ కనిపించాయి. అయితే థియేటర్లలో విడుదల అయింది కాబట్టి ఇక ఓటీటీలో ఎప్పుడు వస్తుంది? అని పవన్ అభిమానులు సహా తెలుగు ప్రేక్షకులు కుడా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆ వివరాలు

అధికారిక రీమేక్ గా
మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ అధికారిక రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారిగా నటించగా మాజీ ఆర్మీ అధికారి పాత్రలో రానా నటించాడు. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ భీమ్లా నాయక్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

70 కోట్ల వరకు
నిత్యా మీనన్ పవన్ కి జంటగా నటిస్తుండగా సంయుక్త మీనన్ రానాకు జంటగా నటించింది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. అయితే ఇప్పటికే కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.70 కోట్ల వరకు అమ్ముడుపోయాయి.

డిస్నీ+ హాట్‌స్టార్
ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ రేటు పలికాయి. ఒక్కటి కాదు.. రెండు ఓటీటీ సంస్థలు భీమ్లా నాయక్ రైట్స్ సొంతం చేసుకున్నాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌తో పాటు ఆహాలోనూ భీమ్లా నాయక్ విడుదల కానుంది. అయితే అసలు ఈ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అనే చర్చ మొదలైంది. అయితే డిస్నీ+ హాట్‌స్టార్ ఈ చిత్రాన్ని మార్చి చివరి నాటికి ప్రీమియర్‌గా ప్రదర్శించాలని ప్లాన్ చేస్తోందని సమాచారం.

మార్చ్ 25న విడుదల
అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అయిన కొన్నాళ్ల తరువాత ఆహాలో విడుదల కానుందట. సాధారణంగా చిన్న సినిమా విడుదలైన 30 రోజులకు కానీ పెద్ద సినిమాలు విడుదలైన 50 రోజులకు ఓటీటీలో విడుదల చేయాలని రూల్స్ ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో పెద్ద సినిమాలైనా కూడా విడుదలైన 30 రోజుల్లోపే ఓటిటిలో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలో కూడా ఇదే జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను మార్చ్ 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

వరుస సినిమాలు
ఇక పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'హరి హర వీరమల్లు' అనే టైటిల్ ఖరారు చేశారు.


Click it and Unblock the Notifications











