Bheemla Nayak ప్రీ రిలీజ్ ఈవెంట్.. రాబోయే ముఖ్య అతిథులు ఎవరంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. గత ఏడాది నుంచి వాయిదా పడుతున్న ఈ సినిమా మొత్తానికి ఫిబ్రవరి నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఇక వేడుక ఎప్పుడు? ఎక్కడ జరగబోతోంది? అతిథులుగా ఎవరెవరు వస్తున్నారు? అనే వివరాల్లోకి వెళితే..

100 కోట్ల బిజినెస్
మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన భీమ్ల నాయక్ సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమాతో పవర్ స్టార్ రానా కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు తేల్చి చెప్పేశాయి. ఇక సినిమాకు మార్కెట్ పరంగా 100కోట్ల వరకు బిజినెస్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

అనేక కారణాల వల్ల వాయిదా
ఈ సినిమాకు దర్శకుడు సాగర్ కె చంద్ర అయినప్పటికీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడు. త్రివిక్రమ్ మూవీకి డైలాగ్స్ అందించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ మిగతా సినిమాల నుంచి పోటీ రావడం అలాగే కరోనా కారణంగా, టికెట్లు రేట్లు తక్కువగా ఉండడం ఇలా అనేక సమస్యలతో భీమ్లా వాయిదా పడింది.

డేట్ ఫిక్స్
ఇక మొదట సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన లేదా ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. ఈ రెండు డేట్స్ లలో ఎదో ఒక డేట్ ఫిక్స్ చేయాలని గత రెండు రోజుల నుంచి చర్చలు జరిపిన నిర్మాత నాగ వంశీ ఫైనల్ గా ఫిబ్రవరి 25వ తేదీని ఫిక్స్ చేసుకున్నారు. ఆ డేట్ కు మరికొన్ని సినిమాలు విడుదల అవుతున్నప్పటికి భీమ్లా పైనే అందరి ఫోకస్ పడుతోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్
ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిబ్రవరి 21న గ్రాండ్ గా నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. అందుకోసం హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ ను వేదికగా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక భీమ్లా నాయక్ ట్రైలర్ ను కూడా అదే రోజు విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Recommended Video

ముఖ్య అతిధులుగా..
ఇక భీమ్లా నాయక్ సినిమాకు ముఖ్య అతిధులుగా ఎవరెవరు వస్తారు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన స్టార్ డైరెక్టర్స్ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందట. హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్, భవదియుడు భగత్ సింగ్ డైరెక్టర్ క్రిష్ తో పాటు త్వరలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనున్న సురేంధర్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉందట. ఇక మెగా హీరోలలో ఎవరెవరు వేడుకకు వస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











