For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆచార్య మాట వినని భీమ్లా నాయక్.. నో కాంప్రమైజ్ అంటూ సంక్రాంతి బరిలోకి పవన్!

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి సినిమాలు విడుదల తేదీపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమా ఎప్పుడు వస్తుందనేది ఇప్పట్లో క్లారిటీ అయితే వచ్చేలా లేదు కొంతమంది పెద్ద హీరోలు అయితే వచ్చే సంక్రాంతికి భారీ స్థాయిలో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆ సినిమాలు ఏ స్థాయిలో విజయం అందుకుంటాయో తెలియదు గాని బాక్సాఫీస్ వద్ద పోటీ తీవ్రత మాత్రం అస్సలు తగ్గలేదు అని అర్థమవుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఏడాదికి పైగా విడుదలను వాయిదా వేసుకుంటున్న పెద్ద హీరోలు పొంగల్ ఫెస్టివల్ ను ఏ ఏమాత్రం మిస్ చేసుకోవద్దని బలంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ విషయంలో ఇటీవల కొన్ని చర్చలు అయితే జరిగాయి. ఆచార్య సినిమాకు సంబంధించిన నిర్మాత దర్శకుడు ఆ డేట్ కోసం కొంత ప్రయత్నాలు జరిపినప్పటికీ వర్కవుట్ కాలేదని తెలుస్తోంది.

  అందుకే ఫెస్టివల్స్ ను టార్గెట్ చేస్తున్నారు

  అందుకే ఫెస్టివల్స్ ను టార్గెట్ చేస్తున్నారు

  సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదల తేదీ ని ఫిక్స్ చేసుకుంటే వాయిదా వేసుకోవడం పెద్ద సమస్య ఏమీ కాదు. ఎందుకంటే వారి సినిమాలు ఎప్పుడు విడుదలైనా కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తాయి. అయితే ఈ రోజులలో కూడా పెద్ద హీరోలకు కూడా కొంత డ్యామేజ్ జరుగుతోందని డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఫెస్టివల్స్ ను టార్గెట్ చేయడం బెటర్ అని నిర్ణయం తీసుకున్నారు.

  అందరి ఫోకస్ సంక్రాంతి పైనే..

  అందరి ఫోకస్ సంక్రాంతి పైనే..

  ఇక సినిమాలకు ఎంతో ప్రత్యేకమైన సంక్రాంతి పండగలలో బిజినెస్ ఏ స్థాయిలో అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సమయంలో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. పాజిటివ్ టాక్ వస్తే కుటుంబ సమేతంగా సినిమా హాల్స్ నిండుగా కనిపిస్తాయి. అందుకోసమే చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటారు. 2022 సంక్రాంతికి కూడా సినిమాలు ఒకేసారి పోటీకి సిద్ధమయ్యారు.

  భీమ్లా నాయక్ డేట్ కోసం ఆచార్య మంతనాలు

  భీమ్లా నాయక్ డేట్ కోసం ఆచార్య మంతనాలు

  ముందుగా సంక్రాంతి సీజన్ లో పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. జనవరి 12న సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. అయితే అదే ఫెస్టివల్ కు మహేష్ బాబు సర్కారు వారి పాట, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలు కూడా రెండు మూడు రోజుల గ్యాప్ లోనే బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ పోటీలోకి ఆచార్య సినిమా కూడా రావాలని అనుకుంది. ఒకేసారి మూడు పెద్ద సినిమాలతో పోటీ డేంజర్ అని భీమ్లా నాయక్ ఫిక్స్ చేసుకున్న డేట్ ను త్యాగం చేయమని కోరారు.

  House Arrest Movie Team Funny Chit Chat With Roll Rida
  వెనక్కి తగ్గని భీమ్లా నాయక్

  వెనక్కి తగ్గని భీమ్లా నాయక్


  ఇటీవల దర్శకుడు కొరటాల శివ భీమ్లా నాయక్ నిర్మాతలతో కూడా చర్చలు జరిపినట్లు టాక్ అయితే వచ్చింది. అయితే ఈ విషయంలో మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతవరకు చర్చలు జరిపారు అనే విషయంపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ రెండు సినిమాల నిర్మాతల మధ్య చర్చలు జరిగాయని మాత్రం తెలుస్తోంది. భీమ్లా నాయక్ కోసం జనవరి 26ను ఆప్షన్ గా ఇవ్వడంతో సితార ఎంటర్టైన్మెంట్ వారు ఏమాత్రం ఒప్పుకోలేదట. దీంతో చేసేదేమీ లేక ఆచార్య టీమ్ రిపబ్లిక్ డే నాడు సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు టాక్ వస్తోంది. లేదా సమ్మర్ లో అయినా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం.

  English summary
  Bheemla nayak team declined acharya request and ready to release in sankranthi,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X