For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bheemla Nayak : పెదవి విరిచిన పవన్ ఫ్యాన్స్.. థమన్ నువ్ బయటకనపడద్దు అంటూ!

  |

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ వేడుకల్లో ఎక్కడ హాజరు కాకపోయినా ఆయన జన్మదినాన్ని అభిమానులతో పాటు సినిమా రంగానికి చెందిన చాలామంది ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే దీనికి పవనోత్సవం అనే పేరు పెట్టి మరీ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

  అయితే పవన్ పుట్టిన రోజు సందర్భంగా భీమ్లా నాయక్ సినిమా నుంచి రిలీజ్ అయిన ఒక సాంగ్ ఇప్పుడు ఫాన్స్ కి నచ్చలేదు అని అంటున్నారు. దీని మీద నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

  మెగా అభిమాని పెళ్లికి అల్లు అర్జున్.. వివాహ వేడుకలో సాయిధరమ్ తేజ్, ఇంకా సినీ ప్రముఖులు ఎవరంటే!

  భీమ్లా నాయక్ ఎంట్రీ

  భీమ్లా నాయక్ ఎంట్రీ

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ అనే సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదల కాక ముందే ఆయన చాలా సినిమాలు ఒప్పుకున్నారు. అందులో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రూపొందిన సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాని తెలుగులో భీమ్లా నాయక్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో బిజు మీనన్ పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో ఇక్కడ పవన్ కళ్యాణ్ - రానా నటిస్తున్నారు.

  RX 100 Karthikeya కాబోయే భార్య ఎంత అందంగా ఉందొ చూశారా? హీరోయిన్స్ చాలరు!

  పూనకాలతో

  పూనకాలతో

  ఈ సినిమాకు సంబంధించి కథాకథనం మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తూ ఉండగా అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో దర్శకుడిగా మారిన సాగర్ కే చంద్ర ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫిక్స్ చేసి రిలీజ్ డేట్ తో పాటు పవన్ కి సంబంధించిన చిన్న వీడియో ఒకటి విడుదల చేశారు. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ లుక్ అలాగే ఆయన ఆవేశంతో డానియల్ శేఖర్ కోసం వెతుకుతూ వెళుతున్న సీక్రెట్ చూసి అభిమానులు పూనకాలతో ఊగిపోయారు.

  Izabelle Leite: 'వరల్డ్ ఫేమస్ లవర్' బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందంటే.. హాట్ బికినీ ఫొటోస్

  లిరిక్స్ అదిరిపోయాయి

  లిరిక్స్ అదిరిపోయాయి

  ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా థమన్ సంగీతం అందించిన టైటిల్ సాంగ్ విడుదల చేశారు. జానపద రీతిలో సాగిన ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగ్గట్టుగా ఉందని కొందరు అభిప్రాయపడుతుంటే కొందరు ఫ్యాన్స్ మాత్రం ఈ సాంగ్ అసలు ఏమాత్రం ఆకట్టుకునేలా ఈ విధంగా లేదని అంటున్నారు. ‘భీమ్లా నాయక్' క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేస్తూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అదిరిపోయాయి.

  Avinash Engagement: అవినాష్ పెళ్లాడే అమ్మాయి ఎవరంటే.. పర్సనల్ ఫొటోల్లో ఎలా ఉందో చూడండి!

  మంచి వ్యూస్ వస్తున్నా

  మంచి వ్యూస్ వస్తున్నా

  థమన్, శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్ మిరియాల నలుగురూ కలిసి సాలిడ్ ఎనర్జీతో అద్భుతంగా పాడారు. రిలీజ్ చేసిన కొద్దిసేపటికే మంచి వ్యూస్ వస్తున్నాయి. కొందరు ఫ్యాన్స్ అయితే ఏకంగా తమ ని టార్గెట్ చేసి కావాలనే మాకు ఇలాంటి సాంగ్స్ ఇచ్చి ఆసక్తి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు.

  Ananya Nagalla : అప్పట్లో అలా ఇప్పట్లో ఇలా.. బొద్దుగా vs ముద్దుగా!

  Pawan Kalyan రాజ్యాన్ని ఏలడానికి 6 సూత్రాలు | Bheemla Nayak || Filmibeat Telugu
  థమన్ బయటకు రావొద్దు

  థమన్ బయటకు రావొద్దు

  ఈ సాంగ్ ఎన్నిసార్లు వింటున్నా ఆసక్తికరంగా లేదని కొందరు అంటుంటే వినే కొద్ది ఆసక్తి పెరుగుతూ ఉందని మరికొందరు అంటున్నారు. ఇక థమన్ ని టార్గెట్ చేస్తున్న అభిమానులు ఈ రోజు బయటపడితే ఊరుకోము అన్నట్లుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక థమన్ మీద ఎక్కువగా మీమ్స్ వస్తూ ఉండే సంగతి అందరికీ తెలిసిందే. ఈ మీమ్స్ చేసే వాళ్ళని కూడా తమను విమర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజుతో బయట కనబడితే ఊరుకోమని చెబుతూ ఉన్న మీమ్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

  English summary
  Bheemla Nayak Title Song released today. but song Gets Negative Reviews From Powerstar Fans.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X