మొత్తానికి మెగాస్టార్ కు కథ వినిపించిన నితిన్ దర్శకుడు
ఒక సినిమా హిట్టయితే ఒకప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మరో సినిమా పై ఫోకస్ పెట్టేవారు. కానీ ఈ రోజుల్లో ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే హీరోలు దర్శకులు మరో సినిమాను సెట్స్ పైకి తెస్తున్నారు. ఇక మెగా స్టార్ చిరంజీవి వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మరో యువ దర్శకుడు చెప్పిన కథపై మెగాస్టార్ పాజిటివ్ గా స్పందించారట.
నితిన్ తో గత ఏడాది భీష్మ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ కుడుముల బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్న విషయం తెలిసిందే. ఆ దర్శకుడికి ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ తో ఒక కమిట్మెంట్ ఉంది. మొదటి సినిమా ఛలో తోనే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించగలడని నిరూపించుకున్న వెంకీకి భీష్మ హిట్టు పడగానే చాలా మంది నిర్మాతల నుంచి ఆఫర్స్ వచ్చాయి.

ఇక ఫైనల్ గా మైత్రి మూవీ మేకర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ కుడుముల ఇటీవల మెగాస్టార్ కు అయితే ఒక కథను వినిపించాడట. మెగాస్టార్ అతని కథపై పాజిటివ్ గా స్పందించినప్పటికి ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. మెగాస్టార్ సాధారణంగా ఏ కథకైనా సరే అంత ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. వీలైనంత వరకు అనుభవం ఉన్న దర్శక రచయితలతో కూడా చర్చలు జరుపుతుంటారు. మరి వెంకీ కుడుముల కథపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలి అంటే మరికొన్ని. రోజులు వేయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











