రీషూట్‌లలో సునీల్ కొత్త చిత్రం??
హైదరాబాద్ : తాము అనుకున్నది అనుకున్నట్లు రాకపోతే సాధారణంగా చిత్రం పూర్తయ్యాక దర్శక,నిర్మాతలు రీషూట్స్ కార్యక్రమం మొదలెడతారు. తాజాగా కామెడీ హీరో సునీల్ తాజా నటించిన భీమవరం బుల్లోడు కి రీషూట్స్ జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. చిత్రం పూర్తైన రషెష్ చూసుకున్న సునీల్ కొన్ని చోట్ల తను అనుకున్నట్లు రాలేదని రీషూట్స్ అడిగాడని చెప్తున్నారు. అయితే సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్ధ నుంచి వచ్చే చిత్రం అలాంటి రీషూట్స్ కు వెళుతుందా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రూషూట్స్ చేయటం వల్లే సంక్రాంతి తర్వాత అనుకున్న చిత్రం రిలీజ్ డేట్ ఇప్పటివరకూ ప్రకటించలేదని వినికిడి..
సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈచిత్రాన్ని 'కలిసుందాం..రా!, ప్రేమతో..రా!, రారాజు, బలాదూర్' వంటి సినిమాలను తెరకెక్కించిన ఉదయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 'వేయి అబద్దాలు' ఫేమ్ ఎస్తేర్ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. దర్శకుడు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ- భీమవరం బుల్లోడు చిత్రం తో మరోసారి ఈ సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉందని, సునీల్ పాత్ర వైవిధంగా ఉంటుందని తెలిపారు. భీమవరం నివాసి అయిన సునీల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఈ పేరు పెట్టడం విశేషమని, పాడింగ్ ఆర్టిస్టులందరూ చిత్రంలో నటిస్తున్నారని అన్నారు.
అలాగే ఈ చిత్రం Short Time (1990) అనే సినిమా ఆధారంగా రూపొందుతోందని తెలుస్తోంది. పిరికివాడైన హీరో ఎలాగూ త్వరలో చనిపోతానని తెలుసుకుని లేని మొండి ధైర్యం తెచ్చుకుని సాహసాలు చేస్తాడు. సంఘ వ్యతిరేక శక్తులను ఎదిరిస్తాడు. అయితే తర్వాత తాను చావబోవటం లేదని, తను తప్పుడు మెడికల్ రిపోర్టులు అందుకున్నానని తెలుసుకుంటాడు. అప్పుడు అతినిలో నిజమైన భయం మొదలవుతుంది. ఈ విషయం తను మొండి ధైర్యంతో ఎదిరించిన విలన్స్ కు సైతం తెలుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందనేది మిగతా కథ. ఇలాంటి కథే భీమవరం బుల్లోడులోనూ ఉండబోతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కాన్సర్ పేషెంట్ ని అనుకున్న సునీల్...మొండితనంతో సాహసాలు చేయటం...తర్వాత తనకు కాన్సర్ లేదని తెలిసి ఇరిక్కిపోవటం ఫన్నీగా ఉంటుందంటున్నారు. అయితే ఇది కరెక్టా కాదా అన్నది తెలియాలంటే సినిమా రిలీజయ్యేదాకా ఆగాల్సిందే.
ఈ చిత్రానికి ఆడియో ఇప్పటికే విడుదల చేసామని,మంచి ఆదరణ పొందుతోందనిని నిర్మాత సురేష్‌బాబు తెలిపారు. తనికెళ్ల భరణి, ఎస్తేర్, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, గౌతమ్‌రాజు, శ్రీనివాసరెడ్డి, తా.రమేష్, సమ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కథ:కవి కాళిదాస్, మాటలు:శ్రీధర్ శీపన, కెమెరా:సంతోష్‌రాయ్, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత:డి.సురేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఉదయ్ శంకర్.


Click it and Unblock the Notifications












