twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'భీమవరం బుల్లోడు' రిలీజ్ ఆ తేదీనే

    By Srikanya
    |

    హైదరాబాద్ : సునీల్ హీరోగా ఉదయశంకర్ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న 'భీమవరం బుల్లోడు' సినిమా ముందు ప్రకటించినట్లుగా ఈ నెల 14న విడుదల కాలేదు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉండటంతో వాయిదా వేసారు. అయితే ఇప్పుడా సినిమాని 27 న విడుదల చేయటానికి నిర్ణయించారని సినీ వర్గాల సమాచారం. ఆ రోజున భారీ ఎత్తున సునీల్ కెరీర్ లోనే ఎక్కువ థియోటర్స్ లో విడుదల చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తున్నారు.

    సురేష్ బాబు మాట్లాడుతూ...'సినిమా బాగా వచ్చింది. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపుదిద్దుకుంది. ఆడియోలో లేని కొత్త పాటను సినిమాలో జత చేశాం' అన్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈచిత్రాన్ని 'కలిసుందాం..రా!, ప్రేమతో..రా!, రారాజు, బలాదూర్' వంటి సినిమాలను తెరకెక్కించిన ఉదయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 'వేయి అబద్దాలు' ఫేమ్ ఎస్తేర్ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు.

    హీరో సునీల్ మాట్లాడుతూ 'కమెడియన్‌గా నా నుంచి ప్రేక్షకులు మిస్సవుతున్న ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో ఉంటుంది' అన్నారు. దర్శకుడు ఉదయ్ శంకర్ మాట్లాడుతూ- భీమవరం బుల్లోడు చిత్రం తో మరోసారి ఈ సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉందని, సునీల్ పాత్ర వైవిధంగా ఉంటుందని తెలిపారు. భీమవరం నివాసి అయిన సునీల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఈ పేరు పెట్టడం విశేషమని, పాడింగ్ ఆర్టిస్టులందరూ చిత్రంలో నటిస్తున్నారని అన్నారు.

    ఈ చిత్రానికి ఆడియో ఇప్పటికే విడుదల చేసామని,మంచి ఆదరణ పొందుతోందనిని నిర్మాత సురేష్‌బాబు తెలిపారు. తనికెళ్ల భరణి, ఎస్తేర్, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, గౌతమ్‌రాజు, శ్రీనివాసరెడ్డి, తా.రమేష్, సమ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కథ:కవి కాళిదాస్, మాటలు:శ్రీధర్ శీపన, కెమెరా:సంతోష్‌రాయ్, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత:డి.సురేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఉదయ్ శంకర్.

    English summary
    'Bheemavaram bullodu' was earlier supposed to be released on 14th of this month. However, due to the chaotic political situations in the state, the makers could not find proper date in the second and third week of this month to release the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X