సీతమ్మ తల్లిగా భూమక ఖరారు
త్వరలో భూమిక ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. సీతమ్మ తల్లి టైటిల్ తో రూపొందే ఈ చిత్రాన్ని హాస్య నటుడు మరియు దర్శకుడు అయిన ఎవీయస్ డైరక్ట్ చేయనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళుతుందని, ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలని అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇక కోతిమూక చిత్రం తర్వాత ఎవీయస్ చేస్తున్న చిత్రం ఇది. మొదటి నుంచీ కామెడీ చిత్రాలనే డైరక్ట్ చేస్తూ వచ్చిన ఏవీయస్ ఈ చిత్రాన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా సెంటిమెంట్ తో తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఆమెకు వెంకటేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ఆఫర్ వచ్చింది. అయితే ఆమె దానిని రిజెక్టు చేసింది.
ఆ విషయమై ఆమె మాట్లాడుతూ.. ఒక్కడులో నేను మహేష్ కు ప్రియురాలిగా నటించాను. ఇప్పుడు ఆయనకు వదిన గా నటించటమంటే ఆసక్తి లేదు అని చెప్పేసింది. దాంతో ఆమెను హీరోయిన్ గా బుక్ చేసే వారు లేరు. అలాగని ఆమె కాస్త ప్రాధాన్యత తగ్గిన పాత్రలని చేయనని నిక్కచ్చిగా చెప్తోంది. ఈ నేపధ్యంలో ఆమెను ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఒప్పించారు. మరో ప్రక్క ఆమె తెలుగులో నిర్మించి,నటించిన తకిట..తకిట చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేసి వదులుతోంది. ఈ చిత్రం అక్కడ గ్యారెంటీగా ఆడుతుందని నమ్మకాలు పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











