»   » భూమిక లేట్ నైట్స్ పై గుసగుసలు

భూమిక లేట్ నైట్స్ పై గుసగుసలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖుషీ చిత్రంలో పవన్ కళ్యాణ్ జంటగా చేసి కుర్రకారు ఆరాధ్య దైవంగా మారిన భూమిక ఆ తర్వాత పెళ్లి చేసుకుని రిటైరైపోయింది. అప్పటికీ ఫీల్డులో ఉన్నాననిపించుకునేందుకు మాయాబజార్ అనే సినిమా పత్రిక, తకిట తకిట అనే సినిమా తన సొంత డబ్బుతో చేసింది. కానీ అవి రివర్స్ అవటంతో సైలెంట్ అయిపోయంది. అయితే గత కొద్ది రోజులుగా భూమిక కారు అనుష్క ఇంటి దగ్గర ఉంటోందని, దాదాపుగా రోజూ లేట్ నైట్స్ ని అక్కడే గడుపుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి. భూమిక బెంజ్ కారు దాదాపు రాత్రంతా అనుష్క ఇంటివద్దనే ఉండి తెల్లవారు ఝామున వెల్లిపోతోందంటున్నారు.

స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న అనుష్క తన భర్త భరత్ ఠాకూర్ శిష్యురాలే కావటం, తనకూ స్నేహితురాలు కావటంతో తోచక అక్కడికి వెళ్తోందని కొందరంటున్నారు. అయితే మరికొందరు మాత్రం లేదు..భూమిక ఇప్పుడు సినిమాని డైరక్ట్ చేసే ఆలోచనలో ఉంది. అందుకు అవసరమైన సూచనలు, సలహాలు, సంప్రదింపులు అనుష్క నుంచి పొందుతోందని చెప్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇంటివద్ద ఉండకుండా ఇలా రాత్రంతా అనుష్క ఇంటివద్ద ఉండటంతో భరత్ ఠాకూర్ కీ ఆమెకి మధ్య విభేదాలు నిజమేనేమో అనే సందేహాలు కూడా కలుగుతున్నాయంటున్నారు.

English summary
Bhumika is caught most of the times wandering in Jubilee Hills during nights. A close source shared that Bhumika is spending most of her nights with hot beauty Anushka.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu