twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే భూమికకు పనిగట్టుకుని మరీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నారు

    By Srikanya
    |

    పెళ్ళయ్యాక హీరోయిన్ గా కెరీర్ నుంచి రిటైరైన భూమిక ఆ మధ్య నిర్మాతగా 'తకిట తకిట"చిత్రం తీసి ఫెయిలైంది. దాంతో మరీ ఇంట్లో గోళ్ళు గిల్లు కుంటూ ఇంట్లో కూర్చోలేని ఆమెకు ఓ అధ్బుతమైన ఐడియా వచ్చింది. అదే డైరక్షన్ కోర్స్ ట్రైనింగ్ తీసుకోవటం. పూర్తయ్యాక తన పరిచయాలతో ఓ హీరో డేట్స్ పట్టి ఓ చిత్రం డైరక్ట్ చేసి తన టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలని నిర్ణయించుకుందని సమాచారం. ఈ మేరకు భూమిక సీరియస్ గా ట్రై చేస్తోంది. ముంబైలోని ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో ఆమె జాయినైంది. గత కొద్ది నెలలుగా ఆమె తన భర్త భరత్ ఠాకూర్ కి దూరంగా ఉంటోందంటూ వార్తలు వస్తున్నాయి. ఆమె ఆ మధ్య మీడియాని కలిసి నా కాపురంలో నిప్పులు పోయిద్దు..మేమిద్దరం బాగానే ఉన్నామంటూ మొత్తుకుంది. ఇక ఆమెకు తెలుగులోని కొందరు హీరోలు మేము నీకు పూర్తి సపోర్టు ఇస్తాం...నువ్వు త్వరగా నేర్చుకుని వచ్చేయ్ అని ప్రోత్సహిస్తున్నారట. అందులోనూ అలా మొదలైంది చిత్రం హిట్టై మళ్ళీ మహిళా దర్శకులకు పేరు రావటంతో ఆమెలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఇక ఆమెకు ఉన్న మరో ప్లస్ పాయింట్ ఆమె నిర్మాత కావటం అని చెప్తున్నారు. అంతేగాక అనూష్క వంటి వారి డేట్స్ ఆమెకు ఈజీగా లక్ష్యం అవుతాయని, నాగార్జున వంటి వారు వెనక నిలబడి అండగా ఉంటామనటం ఆమెకు మంచి ఉత్సాహిస్తోంది. ఇక ఆమె దర్శకురాలుగా ప్రయత్నించబోతోందని తెలిసిన మిగతా డిపార్టమెంట్ లు వారు పనిగట్టుకుని మరీ ఆమెకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నారట. ఆమె తమకి అవకాశం ఇవ్వకపోతుందా అనే ఉద్దేశ్యంతో. అదీ సంగతి.

    English summary
    Popular heroine Bhoomika, has turned a director and wants to direct a film. Long Back she became a producer and produced a film “Takita Takita’ under the banner of Downtown Films, under the direction of Srihari Nanu of “Satyabhama’ fame.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X