మాజీ సీఎం కొడుకుతో స్టార్ హీరోయిన్ ప్రేమాయణం? హోటల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా..!
దేశంలో రాజకీయాలు, సినిమాలను విడదీసి చూడలేం.. భారతీయ సమాజంపై అత్యంత ప్రభావం చూపగల రంగాలుగా వీటికి గుర్తింపు ఉంది. అలాగే భారతదేశంలో రాజకీయ నాయకులను పెళ్లాడిన నటీనటులు ఎందరో ఉన్నారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో స్టార్స్.. పొలిటీషియన్స్‌తో ప్రేమలో పడి వారిని పెళ్లాడి జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఓ కొత్త జంట వచ్చి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హీరోయిన్‌లతో నాయకుల ప్రేమాయణం
బాలీవుడ్‌లో హీరోయిన్ పరిణితి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, స్వర భాస్కర్.. సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్ జిరార్ అహ్మద్, ఆయేషా టాకియా- సమాజ్‌వాదీ పార్టీ నేత ఫర్హాన్ అజ్మీ, నవనీత్ కౌర్- ఎమ్మెల్యే రవి రాణా, కుమారస్వామి- రాధిక తదితరులు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి బాటలోనే ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్నారట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భూమి పడ్నేకర్, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే.

విలక్షణ నటిగా గుర్తింపు
2015లో దమ్ లగా కే హైసా మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు భూమి పడ్నేకర్. ఆ తర్వాత టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా, శుభ్ మంగళ్ సావధాన్, లస్ట్ స్టోరీస్, బాలా, పతి పత్ని ఔర్ వో, భూత్, దుర్గామతి, రక్షాబంధన్, గోవింద నామ్ మేరా, భీడ్, థాంక్యూ ఫర్ కమింగ్, ది లేడీ కిల్లర్, భక్షక్, ఖేల్ ఖేల్ మైన్, మేరే హజ్బెండ్ కీ బీవీ సినిమాలలో నటించారు. గ్లామర్ షోతో పాటు కథా ప్రాధాన్యమున్న సినిమాలలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు భూమి పడ్నేకర్. సినిమాలతో పాటు బుల్లితెరపైనా తనదైన ముద్ర వేశారు ఈ ముద్దుగుమ్మ. నటనతో పాటు పర్యావరణ వేత్తగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. వాతావరణ మార్పులపై పోరాడుతూ.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆధ్వర్యంలోని యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీలోనూ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.
థాక్రే వారసుడిగా దూకుడు
ఇక ఆదిత్య థాక్రే విషయానికి వస్తే.. మహారాష్ట్ర రాజకీయాలను శాసించే థాక్రే కుటుంబానికి వారసుడు. తండ్రి ఉద్దవ్ థాక్రే వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఈ కుర్రాడు.. తొలుత యువసేన అధ్యక్షుడిగా ప్రస్థానం ప్రారంభించారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వోర్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన థాక్రే కుటుంబ వ్యక్తిగా ఆదిత్య నిలిచాడు. అదే ఏడాది ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. శివసేనలో చీలిక అనంతరం జరిగిన 2024 ఎన్నికల్లో మరోసారి వోర్లీ నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన (ఉద్దవ్ బాల్ థాక్రే) పార్టీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. 35 ఏళ్ల ఆదిత్య థాక్రే ఇంకా పెళ్లి చేసుకోలేదు.. ఆయన పెళ్లిపై గతంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
రెస్టారెంట్‌లో దొరికిపోయిన ఆదిత్య, భూమి
ఇదిలాఉండగా.. ఆదిత్య థాక్రేతో కలిసి భూమి పడ్నేకర్ ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో క్లోజ్‌గా కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో సినీ, రాజకీయ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. దాంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని.. వీరు ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని.. అధికారిక కార్యక్రమం కోసం భూమి, ఆదిత్య కలిశారని తెలుస్తోంది. యంగ్ గ్లోబల్ లీడర్స్ సభ్యుల కోసం భూమి.. బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో విందు ఇచ్చారట. ఈ కార్యక్రమానికి ఆదిత్య థాక్రేతో పాటు క్రిస్టర్ క్లోస్ తదితరులు హాజరయ్యారు. పార్టీ ముగిసిన తర్వాత అంతా తిరిగి ఇళ్లకు వెళ్తుండగా భూమి, ఆదిత్యలు మీడియాకు దొరికిపోయారు. సో.. అదన్నమాట మేటర్.


Click it and Unblock the Notifications











