SSMB28: మహేశ్ సినిమాలో మరో హీరోయిన్.. ఏకంగా పోలీస్ కానిస్టేబుల్‌గా!
ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. అయితే, అతడి గత చిత్రం 'సర్కారు వారి పాట' ఆశించిన రీతిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. అయినప్పటీకి ఆ ఫలితాన్ని పట్టించుకోకుండానే మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. 'అతడు', 'ఖలేజా' వంటి క్లాసిక్ మూవీల తర్వాత వీళ్ల కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా చాలా రోజుల క్రితం రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలు పెట్టుకుంది. ఆ వెంటనే దీనికి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. ఫస్ట్ షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. అలాగే, రెండో షెడ్యూల్‌ను కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే కంప్లీట్ చేసుకుంది. ఇక, ప్రస్తుతం మహేశ్ బాబు వెకేషన్‌కు వెళ్లి రాగా.. యూనిట్ మాత్రం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను నిర్మిస్తోంది. ఇది పూర్తైన వెంటనే షూట్ మొదలెట్టి.. ఏకధాటిగా మొత్తం కంప్లీట్ చేసే ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన వార్త లీకైంది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ఎంతో మంది స్టార్లు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎంతో మంది వేరే భాషలకు చెందిన నటీనటులను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన లేడీ కానిస్టేబుల్ పాత్రలో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫెడ్నేకర్‌ను తీసుకున్నట్లు తాజాగా తెలిసింది. ఈ పాత్ర సినిమా రెండో సగంలో వస్తుందని, కాసేపే ఉన్నా ఎంతో ప్రాముఖ్యం ఉంటుందని తెలిసింది. అందుకే ఈ పాత్రకు గురూజీ ఆమెను సెలెక్ట్ చేశారని అంటున్నారు.

ఈ క్రేజీ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం సమకూర్చుతోన్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











