twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జునను ఢీ కొట్టేందుకు రెడీ అయిన భూమిక: అదిరిపోయే ప్లాన్ వేసిన కల్యాణ్

    |

    కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున. ఇందులో భాగంగానే వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే 'వైల్డ్ డాగ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవగా.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో ఇటీవలే ఓ సినిమాను ప్రారంభించాడు. ఇవి కాక ఎప్పటి నుంచో చర్చల దశలో ఉన్న చిత్రమే 'బంగార్రాజు'. 2016 సంక్రాంతి కానుకగా విడుదలైన భారీ విజయాన్ని అందుకున్న 'సోగ్గాడే చిన్ని నాయన'కు ఇది ప్రీక్వెల్‌గా రాబోతుంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

    తాజా సమాచారం ప్రకారం.. 'బంగార్రాజు'లో ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ భూమిక చావ్లా నటించబోతుందట. అది కూడా ఇప్పటి వరకూ చేయని నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ అని సమాచారం. నాగార్జునపై ఆశ పడి.. అతడిని దక్కించుకునేందుకు ఎంతకైనా తెగించే అమ్మాయిగా ఆమె నటిస్తుందని అంటున్నారు. ఈ పాత్ర రజినీకాంత్ నటించిన 'నరసింహా' సినిమాలో రమ్యకృష్ణను పోలి ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో ఎక్కువ భాగం కనిపించే రోల్ కావడం వల్లే దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నాగ్ - భూమిక మధ్య సీన్స్ బాగుంటాయని టాక్.

    Bhumika Chawla Negative role in Akkineni Nagarjunas Bangarraju

    'బంగార్రాజు' మూవీ కోసం కల్యాణ్ కృష్ణ ఎప్పుడో స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టేశాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇటీవలే ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తయ్యాయి. ఇక, ఇందులో అఖిల్ కానీ, నాగ చైతన్య కానీ నటించాల్సి ఉంది. ఈ విషయాన్ని వాళ్లే పలుమార్లు చెప్పారు. అయితే, ఈ మధ్య ఇందులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేదా నాగశౌర్యలలో ఒకరిని తీసుకునే అవకాశం ఉందని ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. ఇక, ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా రాబోతుంది.

    English summary
    Akkineni Nagarjuna is going to begin the shoot for his dream project Bangarraju this month. The actor wrapped up the shoot for the upcoming film Wild Dog. Wild Dog was initially planned for a direct OTT release. Netflix reportedly grabbed the streaming rights of the film. But, the film unit is now planning to release the film in theatres on April 2nd. The film is in the post-production activities now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X