బాలయ్య సినిమాలో పవన్ హీరోయిన్.. మలుపు తిప్పేస్తుందంటున్నారు.!
గతంలో 'జై సింహా' వంటి హిట్ సినిమాను అందించిన కేఎస్ రవికుమార్‌తో నందమూరి బాలకృష్ణ మరోసారి జట్టుకట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో పూర్తయ్యాయి. కానీ, షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. ఆగస్టు 7 నుంచి బ్యాంకాక్‌లో సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారని సమాచారం. సుమారు నెల రోజులు సాగే ఈ భారీ షెడ్యూల్‌లో రెండు పాటలు, రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ దృశ్యాలు, కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో బాలయ్య సరసన ఎవరిని నటింపజేయాలనే విషయంలో చిత్ర యూనిట్ తర్జనభర్జన పడింది. ఎంతో మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించింది. పలువురితో చిత్ర నిర్మాత సంప్రదింపులు కూడా జరిపారు. ఇటీవల ఇందులో బాలయ్య సరసన 'RX100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, సోనాల్ చౌహాన్ నటిస్తుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత పాయల్ నటించడం లేదని అన్నారు. దీంతో మరో హీరోయిన్‌గా వేదికను ఫైనల్ చేసిందని వార్తలు వచ్చాయి. దాదాపుగా వీరిద్దరినే ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది.

ఇదిలాఉండగా, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం భూమిక చావ్లాను తీసుకుంటున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో భూమిక పాత్ర సినిమాను మలుపు తిప్పుందని కూడా ప్రచారం జరుగుతోంది. గతంలో పవన్ కల్యాణ్ 'ఖుషీ' సినిమా ద్వారా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ సీనియర్ నటి.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి సహా ఎంతో మంది హీరోలతో నటించింది. వివాహం తర్వాత పూర్తిగా కనుమరుగైపోయిన భూమిక.. ఇటీవల సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే నాని నటించిన 'ఎంసీఏ', సమంత 'యూటర్న్'లో కనిపించింది.


Click it and Unblock the Notifications











