బాలయ్య సినిమాలో లేడీ విలన్ రోజా కాదు.. బబ్లీ హీరోయిన్‌ను ఫిక్స్ చేసిన బోయపాటి.!

By Manoj Kumar P

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలాంటి వాటిలో నటసింహా నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో ఒకటి. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చినవి రెండు సినిమాలే అయినా.. అవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీనికితోడు బాలయ్యతో బోయపాటి చేసే ప్రయోగాలు సఫలం అవడంతో ఈ కాంబోపై అంచనాలు భారీగా ఉంటాయి. మూడోసారి కలిసిన ఈ జంట వాటిని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మూవీలో లేడీ విలన్ పాత్రకు బబ్లీ హీరోయిన్‌ను ఫిక్స్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

బాలయ్యకు ఇలా ఎప్పుడూ జరగలేదు

బాలయ్యకు ఇలా ఎప్పుడూ జరగలేదు

నందమూరి బాలకృష్ణ దాదాపు నలభై ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నారు. అయితే, ఆయనకు ఎప్పుడూ జరగని విధంగా 2019లో జరిగింది. పోయిన ఏడాది ఆయన నటించిన మూడు సినిమాలు విడుదల అవగా... అవన్నీ ఘోరంగా పరాజయం పాలయ్యాయి. బాలయ్య కెరీర్‌లో ఏ క్యాలెండర్ ఇయర్‌లో కనీసం మూడు సినిమాలు చేస్తే ఒక్క హిట్ కూడా లేకపోవడం ఇదే తొలిసారి.

హిట్ కోసం మూడోసారి కలిసిన జంట

హిట్ కోసం మూడోసారి కలిసిన జంట

వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు నటసింహా బాలకృష్ణ. అదే సమయంలో చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. భారీ విజయంతో సత్తా చాటాలన్న పట్టుదలతో వీరిద్దరూ మూడోసారి కలిశారు. ‘సింహా', ‘లెజెండ్' వంటి సూపర్ హిట్ల తర్వాత వీళ్లు చేస్తున్న సినిమా ఇటీవలే ప్రారంభం అయింది.

హ్యాట్రిక్ కొట్టేందుకు భారీగా ప్లాన్ చేశారు

హ్యాట్రిక్ కొట్టేందుకు భారీగా ప్లాన్ చేశారు

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీగా ఇది రూపొందుతోంది. అలాగే, ఈ మూవీ కోసం ఆయన అఘోరాగా కనిపించనున్నాడు. ఇందుకోసం గుండుతో దర్శనమిస్తున్నాడు. అలాగే, ఈ మూవీలో హీరోయిన్‌గా కొత్త వాళ్లను తీసుకోబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

 ఆ రెండు సినిమాలనే ఫాలో అవుతున్నారు

ఆ రెండు సినిమాలనే ఫాలో అవుతున్నారు

‘సింహా', ‘లెజెండ్' చిత్రాల్లో నందమూరి బాలకృష్ణ డుయల్ రోల్ ప్లే చేశారు. అదే ఫార్ములాను ఇందులోనూ ఫాలో అవుతున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి అఘోరా పాత్ర కాగా, రెండోది బిజినెస్‌మ్యాన్ రోల్ అని అంటున్నారు. అంతేకాదు, ఇందులో బాలయ్య చేస్తున్న ఓ పాత్రకు డైలాగులు, ఫైట్లు ఉండవని ఇండస్ట్రీలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

బాలయ్యను ఢీకొట్టబోతున్న హీరోయిన్ రోజా

బాలయ్యను ఢీకొట్టబోతున్న హీరోయిన్ రోజా

ఈ సినిమాలో లేడీ విలన్‌ పాత్ర కూడా ఉంటుందని చాలా రోజుల క్రితమే ఓ న్యూస్ లీకైపోయింది. అంతేకాదు, ఆ పాత్రను సీనియర్ హీరోయిన్ రోజా చేస్తున్నారని కూడా అన్నారు. అయితే, ఆ తర్వాత రోజా చేయడం లేదని క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే విలన్ పాత్ర కోసం ఎంతో మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఎవరినీ ఫైనల్ చేయలేదని అంటున్నారు.

Recommended Video

Tollywood And Bollywood Celebrities Participated in Modi's 9 PM 9 Baje Light Lamps event
బాలయ్య సినిమాలో విలన్‌గా బబ్లీ హీరోయిన్‌

బాలయ్య సినిమాలో విలన్‌గా బబ్లీ హీరోయిన్‌

బాలయ్య సినిమాలో నెగెటివ్ రోల్ ఎవరు చేస్తున్నారన్న దానిపై తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం.. ఆ పాత్రను బబ్లీ హీరోయిన్ భూమిక చావ్లా పోషించబోతుందట. గతంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈమె.. కొన్నేళ్లుగా సపోర్టింగ్ రోల్స్ చేస్తోంది. బాలయ్య ‘రూలర్'లోనూ కీలక పాత్ర చేసింది. అందుకే ఈ మూవీకి ఒప్పుకుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X