Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ విషయాలు మాత్రం చెప్పదంటా.. సీనియర్ బ్యూటీ కొత్త అవతారం
భూమిక.. ఈ పేరు వినగానే ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి. అందులో ముఖ్యంగా ఖుషీ సినిమా, మరీ ముఖ్యంగా నడుము సీన్ టక్కున గుర్తుకు వస్తుంది. అంతలా ప్రభావం చూపింది భూమిక. అందుకే ఆ సినిమా వచ్చి ఇన్నేళ్లైనా భూమికను ఇంకా గుర్తుంచుకున్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భూమికకు అంతగా కలిసి రానట్టుగా అనిపిస్తుంది.
నాని ఎమ్సీఏ సినిమాలో వదినగా, యూ టర్న్‌లో భయపెట్టే ఘోస్ట్ క్యారెక్టర్, రూలర్ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించింది. అయితే భూమిక స్థాయికి తగ్గట్టు ఒక్క క్యారెక్టర్ పడి మునుపటి స్టార్ డమ్ మాత్రం రాలేదు. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన భూమిక.. మరో కొత్త అవతారమెత్తబోతోన్నట్టు తెలుస్తోంది.
తాజాగా భూమిక మాట్లాడుతూ.. తనకు నెగిటీవ్ టచ్ ఉన్న పాత్రలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. 'మిస్సమ్మ'లో తన పాత్ర అలానే సాగుతుందని, కానీ.. చివర్లో కథంతా మారిపోతుందని పేర్కొంది. అయితే ఈసారి మాత్రం అలా కాదని తెలిపింది.
సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ నెగిటీవ్ టచ్‌లోనే తన పాత్ర సాగుతుందని వెల్లడించింది. ఓ రకంగా చెప్పాలంటే అది లేడీ విలన్ పాత్ర అని అయితే ఆ సినిమా పేరేమిటో, విషయాలేంటో మాత్రం ఇప్పుడే చెప్పనని, అంతా ఓకే అయ్యాక తెలియజేస్తానని చెప్పుకొచ్చింది.