twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ విషయాలు మాత్రం చెప్పదంటా.. సీనియర్ బ్యూటీ కొత్త అవతారం

    |

    భూమిక.. ఈ పేరు వినగానే ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి. అందులో ముఖ్యంగా ఖుషీ సినిమా, మరీ ముఖ్యంగా నడుము సీన్ టక్కున గుర్తుకు వస్తుంది. అంతలా ప్రభావం చూపింది భూమిక. అందుకే ఆ సినిమా వచ్చి ఇన్నేళ్లైనా భూమికను ఇంకా గుర్తుంచుకున్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భూమికకు అంతగా కలిసి రానట్టుగా అనిపిస్తుంది.

    నాని ఎమ్‌సీఏ సినిమాలో వదినగా, యూ టర్న్‌లో భయపెట్టే ఘోస్ట్ క్యారెక్టర్, రూలర్ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషించింది. అయితే భూమిక స్థాయికి తగ్గట్టు ఒక్క క్యారెక్టర్ పడి మునుపటి స్టార్ డమ్ మాత్రం రాలేదు. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన భూమిక.. మరో కొత్త అవతారమెత్తబోతోన్నట్టు తెలుస్తోంది.

     Bhumika May Act In Negative Role In Upcoming Project

    తాజాగా భూమిక మాట్లాడుతూ.. తనకు నెగిటీవ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. 'మిస్స‌మ్మ‌'లో తన పాత్ర అలానే సాగుతుందని, కానీ.. చివ‌ర్లో క‌థంతా మారిపోతుందని పేర్కొంది. అయితే ఈసారి మాత్రం అలా కాదని తెలిపింది.

    సినిమా ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కూ నెగిటీవ్ ట‌చ్‌లోనే తన పాత్ర సాగుతుందని వెల్లడించింది. ఓ ర‌కంగా చెప్పాలంటే అది లేడీ విల‌న్ పాత్ర‌ అని అయితే ఆ సినిమా పేరేమిటో, విషయాలేంటో మాత్రం ఇప్పుడే చెప్ప‌నని, అంతా ఓకే అయ్యాక తెలియ‌జేస్తానని చెప్పుకొచ్చింది.

    English summary
    Bhumika May Act In Negative Role In Upcoming Project. She Says That She Enjoys Negative Characters. And Wants Do A Full Length Villaian Role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X