twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె కూడా మహేష్ కు 'నో' చెప్పేసింది

    By Srikanya
    |

    మహేష్ కు వదినగా నటించటానికి మొన్నామధ్య త్రిష నో చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా భూమిక కూడా తాను కూడా చేయలేనని చేతులు ఎత్తేసింది. ఒక్కడులో నేను మహేష్ కు ప్రియురాలిగా నటించాను. ఇప్పుడు ఆయనకు వదిన గా నటించటమంటే ఆసక్తి లేదు అని చెప్పేసింది. గత కొద్ది రోజులుగా మహేష్ వదినగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేస్తారా అనేదే హాట్ టాపిక్ గా మారింది.

    మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో శ్రీకాంత్ అడ్డాల రూపొందించనున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రం ఆల్రెడీ లాంచింగ్ జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ ఐదున ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంతను ఎంపిక చేసారు. వెంకటేష్ సరసన ఇంకా ఎవరూ డిసైడ్ చెయ్యలేదు. ఇక సంగీత దర్శకుడు మిక్కీజే మేయర్ ఈ చిత్రం కోసం రెండు పాటలను ఆల్రెడీ సిద్దం చేసారు. అతను శ్రీకాంత్ గత చిత్రం కొత్త బంగారు లోకం కోసం కూడా సంగీతం అందించారు.అప్పట్లో ఆ పాటలు మంచి క్రేజ్ ని క్రియోట్ చేసాయి.

    ఇక అనంత శ్రీరామ్ ఈ చిత్రానికి పాటలు రాస్తున్నారు. మహేష్ బాబు ఫేవెరెట్ కెమెరామెన్ గుహన్ ఈ చిత్రానికి కెమెరా అందించనున్నారు. గుహన్ ఇంతకుముందు అతడు, దూకుడు చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు. అలాగే మహేష్, వెంకటేష్ అన్నదమ్ములగా కనిపించనున్నారని, ఇది ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలకపాత్రకు ఎంపిక చేసారు. సీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు.. అంటే కుటుంబం అని కాన్సెప్టుతో ఈ చిత్రం నిర్మితమవుతోంది.

    English summary
    "I played Mahesh's love interest in Okkadu. So, I have no interest in playing his sister-in-law now," said Bhumika.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X