నాకు పవన్ కళ్యాణ్ కావాల్సిందే అని పట్టుబడుతున్న భూమిక
భూమిక త్వరలో డైరక్షన్ చేయటానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.అయితే ఆమె ఏ హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాసిందా అని అందరికీ సందేహం ఉంది. దానికి సమధానంగా ఆమె పవన్ కళ్యాణ్ ని ఊహించుకుని సీన్స్ రాసిందని చెప్తోంది. పవన్ ఎనర్జీ,ఫెరఫెర్మాన్స్ మిగతా హీరోలు ఎవరికీ సాటిరావు అని తేల్చి చెప్పేసింది. మిగతా హీరోలకు కోపం వచ్చినా ముందు తనకు పవన్ డేట్స్ దొరకటమే ముఖ్యం అనుకుంటోంది. ఈ చిత్రం ఓ మెచ్యూరిటీ కలిగిన రొమాంటిక్ కామిడీ అని కొత్త రకం స్టైలింగ్, విభిన్నమైన డైలాగులతో స్క్రిప్టు రెడీ చేసానంటోంది. తకిట తకిట చిత్రం ఫెయిల్యూర్ రావటంతో ఆమె నిర్మాతగా పనికిరానని అర్దం చేసుకుని ఇలా దర్శకురాలు అవతారం ఎత్తుతోంది. తనకు సూపర్ హిట్ ఇచ్చిన ఖుషీ చిత్రంలోని సహనటుడు పవన్ పైనే ఆమె దృష్టి అంతా ఉంది. ఇక ఆమెకు ఈ విషయంలో ఆమె భర్త భరత్ ఠాకూర్ కూడా సహాయం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక ఆమెకు ప్రేరణని ఇచ్చింది మాత్రం అలా మొదలైంది చిత్రం హిట్టు ఇచ్చిన నందినీ రెడ్డి అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











