'దూకుడు'ని క్రాస్ చేస్తే 12 కోట్లు!?
మహేష్ నటించిన దూకుడు చిత్రం రికార్డు కలెక్షన్స్ ని క్రియేట్ చేసి 2011లో పెద్ద హిట్ చిత్రంగా నిలించింది. ఇప్పుడా చిత్రం రికార్డులని క్రాస్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ చిత్రాన్ని క్రాస్ చేసే రికార్డులు క్రియేట్ చేసే చిత్రాన్ని రూపొందిస్తే దర్శకుడు శ్రీను వైట్లకు పన్నెండు కోట్లు అందేలా చెక్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ టాక్. ఆ చెక్ ఇచ్చింది ఇప్పుడు ఎన్టీఆర్ తో చిత్రం ప్లాన్ చేస్తున్న నిర్మాత బండ్ల గణేష్ అని చెప్తున్నారు. అయితే ఇండస్ట్రీలో ఆరోగ్యవంతమైన పోటీ అని చెప్తున్నారు. ఒక దర్శకుడు క్రియేట్ చేసిన రికార్డుని అదే దర్శకుడు బ్రద్దులు కొట్టేలా స్క్రిప్టు వర్క్ చేసి సినిమాని రూపొందించమని ప్రేరేపించటం మంచి పరిణామనే చెప్పుకుంటున్నారు.
ఇక ఇండస్ట్రీలో వినపడుతున్న టాక్ ప్రకారం బండ్ల గణేష్ ఇచ్చిన చెక్ ని సినిమా విడుదల అయ్యి రికార్డులు క్రాస్ చేసిన తర్వాతే క్యాష్ చేసుకోవాలి. అలా కాకపోతే మొదట అనుకున్న ప్రకారమే శ్రీను వైట్ల రెగ్యులర్ రెమ్యునేషన్ అందుతుంది. ఇక ఈ చిత్రానికి యాక్షన్ అనే టైటిల్ పెట్టినట్లు చెప్తున్నారు. అలాగే ఈ టైటిల్ కి విత్ ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్ లైన్ ని జోడిస్తున్నారు. ఎప్పటిలాగే శ్రీను వైట్ల టీమ్ ఈ చిత్రంపై పూర్తి ఎఫెర్ట్స్ పెట్టి పనిచేస్తోంది. కోనవెంకట్, గోపీ మోహన్ ఈ చిత్రం కథ, మాటలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దమ్ము చిత్రం బిజీలో ఉన్నారు. ఆ చిత్రం షూటింగ్ పూర్తికాగానే ఈ కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.


Click it and Unblock the Notifications











