పవన్ సినిమా కోసం ఇంత ఖర్చు చేస్తున్నారా.! షాక్‌కు గురి చేస్తున్న బడ్జెట్ లెక్కలు
పవన్ కల్యాణ్ రీఎంట్రీ.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతున్న విషయాల్లో ఒకటి. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన ఈయన.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు దూరం అయ్యాడు. అప్పటి నుంచి తాను స్థాపించిన జనసేన పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కోసం మరోసారి మేకప్ వేసుకోవాలని డిసైడ్ అయిపోయాడు పవర్ స్టార్. ఇందులో భాగంగానే మరోసారి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...

ఎంతో మంది ప్రయత్నిస్తే.. ఆయనకే కుదిరింది
టాలీవుడ్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్ కల్యాణ్ పేరు ప్రథమంగా వినిపిస్తుంది. కాబట్టి.. ఆయనతో సినిమా చేయాలని ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత కూడా ఆయనతో మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. పవన్ కల్యాణ్‌ను సినిమా చేసేందుకు ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు.

గాసిప్ అనుకుంటే నిజమేనని తేలింది
వాస్తవానికి పవన్ సినిమాల్లోకి వస్తున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు దిల్ రాజుతో సినిమా చేస్తున్న విషయం కూడా గాసిప్ అనుకున్నారు. కానీ, ఇది నిజమేనని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఓ ఫంక్షన్‌లోనైతే ఫ్యాన్స్ అందరి ముందే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఇటీవల సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

రెండు భాషల్లో హిట్ అయిన చిత్రంతో
బాలీవుడ్‌లో బంపర్ హిట్ కొట్టిన సోషల్ మెసేజ్ మూవీ ‘పింక్' రీమేక్ ద్వారానే పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వేణు శ్రీరామ్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాలో అమితాబ్ పోషించిన లాయర్ పాత్రను ఈయన చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘లాయర్ సాబ్' అన్న టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారు. ‘పింక్' తమిళంలో ‘నెర్కొండ పార్వాయి' పేరుతో వచ్చి ఘన విజయం సాధించింది.

పవన్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు
వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే న్యాయవాది ఇతివృత్తంగా ‘పింక్' మూవీ వచ్చింది. ఇందులో ఆ యువతులుగా తాప్సీ, ఆండ్రియా, క్రితీ నటించారు. ఇప్పుడు తెలుగులో ఈ పాత్రలను పోషించే నటీమణులు కూడా ఫిక్స్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం.. నివేదా థామస్, అంజలి, అనన్య (మల్లేశం ఫేం) ఎంపికయ్యారట.

పవన్ సినిమాకు ఇంత ఖర్చు చేస్తున్నారా.!
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా బడ్జెట్‌కు సంబంధించిన ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు రూ. 75 కోట్లు బడ్జెట్ అనుకుంటున్నారట. పవర్ స్టార్ కమ్‌బ్యాక్ మూవీ కావడంతో పాటు ఆయనకున్న మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే ఇంత ఖర్చు చేస్తున్నారని అంటున్నారు.

షాక్‌కు గురి చేస్తున్న బడ్జెట్ లెక్కలు
ఈ సినిమాకు ఖర్చు చేసే రూ. 75 కోట్లలో పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ ఒక్కటే దాదాపు రూ. 50 కోట్లు ఉంటుందట. అలాగే, కోర్టు సెట్టింగు, మిగిలిన వారి పారితోషికాలు సహా అన్నీ కలిపి రూ. 25 కోట్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కలు చూసి అందరూ షాక్‌కు గురవుతున్నారు.


Click it and Unblock the Notifications











