ఎన్టీఆర్ కు ఇది సవాలే? కానీ తారక్ తగ్గడుగా!
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు నేషనల్ వైడ్ గా మార్కెట్ పెరిగింది. వరల్డ్ వైడ్ గానూ తారక్ సినిమాల పట్ల ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తన్నారు. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ రూ. 1200 కోట్ల వరకు వసూల్ చేసిన విషయం తెలిసిందే. ఇక దేవరతో బాక్సాఫీస్ వద్ద సోలో పెర్ఫామెన్స్ ఇచ్చి రూ.500 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూల్ చేశారు. అయితే బాహుబలి, కేజీఎఫ్.. రీసెంట్ గా పుష్ప2తో తెలుగు సినిమాలు హైయేస్ట్ గ్రాస్ కలెక్షన్స్ చేసిన ఇండియన్ చిత్రాల్లో టాప్ లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టాప్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు భారీ వసూళ్లపైనే ఫోకస్ పెడుతున్నారు.
తాము నిర్మించబోయే సినిమాలను బిగ్ స్కేల్లో రూపొందించి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. కొన్ని ఆశించినా మేర ఫలితానివ్వకపోయినా.. ఆ ఇంపాక్ట్ మాత్రం కనిపిస్తోంది. ఇక పుష్ప2 రీసెంట్ గా బాక్సాఫీస్ వద్ద రూ.1600 కోట్లకు పైగా వసూల్ చేసి ఆశ్చర్యపరిచింది. దీంతో ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ కు రూ.1000 కోట్లు దాటిన తొలి సినిమా దక్కింది. బాహుబలితో ప్రభాస్, పుష్పతో అల్లు అర్జున్ సోలోగా ఈ రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు నెక్ట్స్ రూ.1000 కోట్లు వసూల్ చేయబోయే హీరో ఎవరనేది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆ సత్తా ఎన్టీఆర్ కు ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. అదే స్థాయిలో ఎన్టీఆర్ కూడా భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అయితే.. తారక్ ఏమూవీతో వెయ్యి కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకుంటారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. దేవరతోనే ఆ రికార్డును చేరుకుందామనుకున్న తారక్ కూ ఆశించిన మేర ఫలితం రాలేదు. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ను గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి త్వరలో విడుదల కాబోతున్న చిత్రం 'వార్2'. ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ యాక్షన్స్ తో హై బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రమిది.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వార్2 ఎలాగైనా రూ.1000 కోట్లపైనే వసూల్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తారక్ హిందీ డెబ్యూ మూవీ కావడంతోనూ మంచి అంచనాలు ఉన్నాయి. అప్పటికే వార్ సక్సెస్ అందుకోగా సీక్వెల్ గా భారీ హైప్ నెలకొంది. ఆ రేంజ్ లోనే బిజినెస్ జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఇలా అయినా కూడా తారక్ రూ.1000 కోట్ల సినిమాను మరోసారి అందుకోబోతున్నారనేది తెలుస్తోంది. ఇదిలా సోలోగా బాక్సాఫీస్ వద్ద మాత్రం 'డ్రాగన్'(NTR31)తో రూ.1000 కోట్ల సినిమాను సాధిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్, కంటెంట్ మూలంగా అంతకు మించే రెస్పాన్స్ ఉంటుందని అంటున్నారు. ఇక వార్ 2 ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లోనే ఎన్టీఆర్31(డ్రాగన్) ప్రారంభమై వచ్చే 2026 జనవరిలో రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











