బంగార్రాజు కథ మళ్ళీ మొదటికొచ్చింది.. కన్ఫ్యూజన్ లో పడేసిన నాగ్!

అక్కినేని హీరో నాగార్జున హిట్టు చూసి నాలుగేళ్లవుతోంది. గడిచిన నాలుగేళ్లలో నాగార్జున చేయని ప్రయోగం లేదు. దేవదాస్ అనే మల్టీస్టారర్ తో పాటు రాజుగారి గది వంటి హారర్ మూవీ, ఓం నమో వెంకటేశాయ అనే భక్తిరస సినిమా కూడా చేశాడు. ఇక తన కెరీర్ ని మలుపు తిప్పిన విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కూడా ఆఫీసర్ అనే సినిమా చేశాడు.

తన కెరర్ కి ఒక బ్రాండ్ సెట్ చేసిన మన్మథుడు టైటిల్ తో కూడా ఒక రొమాంటిక్ ప్రయోగం చేసిన నాగ్ ఊహించని దెబ్బ తిన్నాడు. ఇలా ఎన్ని రకాలుగా జానర్స్ మార్చిన హిట్టు మాత్రం దక్కలేదు. ఇక ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే మరొక డిఫరెంట్ సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నాగార్జున బంగార్రాజు ప్రాజెక్టుపై ఇటీవల తన టీమ్ తో చర్చించినట్లు తెలుస్తోంది. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

Big confusion on akkineni nagarjuna bangarraju project

అయితే ఆ కథకు సీక్వెల్ ని సిద్ధం చేయమని నాగ్ ఆ చిత్ర యూనిట్ కి రెండేళ్ల క్రితం చెప్పాడు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అలాగే రైటర్ రామ్ మోహన్ గత ఏడాది నుంచి స్టోరీని డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఎలాగైనా 2021 సంక్రాంతికి బంగార్రాజు కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్న చిత్ర యూనిట్ కి నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది.

కథలో ఎదో మిస్ అవుతుందని అంతగా ఇంట్రెస్టింగ్ గా అనిపించడం లేదని మళ్ళీ ఇటీవల నాగ్ దర్శకుడిని కన్ఫ్యూజన్ లో పదేశాడట. దీంతో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ మళ్ళీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. యధావిధిగా కొత్త తరహాలో కథను రాసేందుకు సిద్ధమయ్యారనే టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X