RRR విషయంలో చేతులెత్తేసిన నిర్మాత.. అందరి ఫోకస్ రాజమౌళి వైపే..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RRR కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేను విధంగా ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు డోస్ అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే ఒక విషయంలో నిర్మాత డివివి.దానయ్య చేతులెత్తేసి పూర్తిగా రాజమౌళి నిర్ణయానికి వదిలేసినట్లు తెలుస్తోంది.
Recommended Video

అంచనాలు మాములుగా లేవు
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాహుబలి తరువాత అంతకుమించి అనేలా తెరకెక్కుతున్న RRRపై అంచనాలు మాములుగా లేవు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రల్లో నటిస్తుండడంతో యాక్షన్ డోస్ హై రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక అప్పుడప్పుడు లీక్ అవుతున్న విషయాలు కూడా మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

నిర్మాత హ్యాపీ
కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ప్రేక్షకులు సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అన్ని వైపులా బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. నిర్మాత డివివి.దానయ్య ప్రీ రిలీజ్ బిజినెస్ తో చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలిసిపోయింది. అయితే ఒక విషయంలో మాత్రం ఆయనకు కూడా క్లారిటీ రావడం లేదట.

మిగతా వారిలో కన్ఫ్యూజన్
ప్రస్తుతం సెకండ్ వేవ్ కారణంగా దాదాపు ప్రతి సినిమా కూడా విడుదలపై ఎటు తేల్చుకోలేని పరిస్థితి. అయితే డేట్ విషయంలో క్లారిటీ లేకపోయినా కూడా సీజన్ విషయంలో మాత్రం ముందే ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నరు. అయితే RRR విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో పుష్ప నిర్మాతలు కూడా కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు

చేతులెత్తేసిన నిర్మాత
RRRకు పోటీగా అయితే ఏ సినిమా రాదని చెప్పవచ్చు. అయితే షూటింగ్ పర్ఫెక్ట్ గా పూర్తయితే గాని జక్కన్న రోలీజ్ డేట్ పై క్లారిటీ అవ్వాలని అనుకోవడం లేదు. సంక్రాంతి, సమ్మర్ అని ఎదో ఒకటి చెబితే మిగతా సినిమాలు వాటి రిలీజ్ డేట్స్ పై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కానీ రాజమౌళి రిలీజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో నిర్మాత కూడా రాజమౌళిని ఇబ్బంది పెట్టడం నచ్చక రిలీజ్ విషయంలో ఇప్పుడే సొంత నిర్ణయం తీసుకోలేను అని చేతులెత్తేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











