త్రివిక్రమ్ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఏడాది అల..వైకుంఠపురములో సినిమాతో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ తో వీలైనంత త్వరగా సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్న త్రివిక్రమ్ కు అనుకోకుండా కరోనా దెబ్బ కొట్టింది. దీంతో ఎక్కువగా స్క్రిప్ట్ లను రాసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఎన్టీఆర్ తో సినిమాను పూర్తి చేసిన తరువాత మిగతా ప్రాజెక్ట్ లపై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాడట.

ఇక పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ సినిమా కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ చేసినట్లు మొదట్లో టాక్ బాగానే వచ్చింది. ఆ సినిమాను డైరెక్ట్ చేయనున్న యువ దర్శకుడు సాగర్ చంద్ర టాలెంటెడ్ అయినప్పటికీ పవన్ స్థాయికి తగ్గట్లు వర్క్ చేయగలడా అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. అందుకే ముందు జాగ్రత్తగా సీతారా ఎంటర్టైన్మెంట్స్ త్రివిక్రమ్ ను స్క్రిప్ట్ డిస్కషన్ లోకి దింపినట్లు టాక్.

Big confusion on trivikram script work for pawan movie

అసలైతే ఈ సినిమా మొదలవ్వడానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ అని టాక్ అయితే వచ్చింది. తొందరగా ఫినిష్ అయ్యే మంచి కథల కోసం పవన్ వెతుకుతున్న క్రమంలో త్రివిక్రమ్ ఆలోచన మేరకు అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ కు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక కథలో తన పెన్నును ఉపయోగించినప్పటికి త్రివిక్రమ్ పేరును ఇంతవరకు పోస్టర్స్ లలో ఎక్కడా వేయ లేదు. దీంతో ఈ విషయం కాస్త కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తోంది. మరి సినిమా విడుదల సమయంలోనైనా థ్యాంక్స్ కార్డ్ లలో త్రివిక్రమ్ పేరును జత చేస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X