అల్లు అర్జున్- మహేష్ బాబు బిగ్ ఫైట్.. విజయం ఎవరిని వరిస్తుందో మరి!
సినీ ఇండస్ట్రీ పెద్ద హీరోల సినిమాల క్లాష్ ఆసక్తికరంగా ఉంటుంది. స్టార్ హీరోలకు ఫ్యాన్ భారీ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైతే ఆ హంగామానే వేరు. ఈ హంగామా ప్రతీ ఏడాది సంక్రాంతికి చూస్తూనే ఉంటాం. అయితే వచ్చే సంక్రాంతికి మాత్రం ఇద్దరు స్టార్ హీరోల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. బన్నీ, మహేష్ బాబు ఒకేసారి థియేటర్స్ లోకి రాబోతున్నారు. దీంతో ఈ ఇరువురి ఫ్యాన్స్ లో ఇప్పటి నుంచే ఉత్కంఠ మొదలైంది.
నా పేరు సూర్య డిసాస్టర్ కావడంతో ఈ సారి ఎలాగైనా హిట్ సాధించి ట్రాక్ ఎక్కాలని కసిగా ఉన్నాడు అల్లు అర్జున్. ఈ మేరకు పవర్ ఫుల్ కాన్సెప్ట్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. చిత్రంలో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే ఆడిపాడుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందని తెలుస్తోంది.

మరోవైపు అదే సంక్రాంతికి మహేష్ బాబు హీరోగా రాబోతున్న సరిలేరు నీకెవ్వరు మూవీ రిలీజ్ కానుంది. పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తుండటం ఆసక్తికర అంశం. పైగా అనిల్ రావిపూడి, మహేష్ బాబు ఇద్దరూ భారీ సక్సెస్‌లు ఖాతాలో వేసుకుంటూ మంచి జోష్ లో ఉన్నారు. ఈ లెక్కన చూస్తే మహేష్ బాబు, అల్లు అర్జున్ మధ్య గట్టి పోటీ తప్పేలా లేదు. దీంతో ఆ మహేష్ బాబు అభిమానులు, ఇటు అల్లు అర్జున్ అభిమానుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ నెలకొంది. చూడాలి మరి ఈ బిగ్ ఫైట్ లో విజయం ఎవరిని వరిస్తుందో!


Click it and Unblock the Notifications











