బీజేపీలోకి చిరంజీవి.. కీలక పదవి రేసులో మెగాస్టార్?
ఇపుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలు అలాగే సినీ పరిశ్రమకి సంబంధించి ఎలా మిళితం అయ్యి కొనసాగుతుందో తెలిసిందే. కాగా సౌత్ నుంచి మరీ ముఖ్యంగా చాలా మంది స్టార్స్ రాజకీయాల్లో ఉన్నారు. అలా ఉన్న వారిలో కొత్తగా వచ్చినవారు అలాగే ఆల్రెడీ సెటిల్ అయ్యినవారు కూడా ఉన్నారు. మరి ఒకప్పుడు సినిమా నుంచి వచ్చిన టాప్ స్టార్స్ వచ్చిన వెంటనే సక్సెస్ అయ్యినవారు కనిపించారు.
కానీ తర్వాత కాలం మారిన తర్వాత మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. అలా తమిళ్ నుంచి సహా తెలుగు నుంచి ఎంజిఆర్ అలాగే సీనియర్ ఎన్టీఆర్ లు భారీ సక్సెస్ అయ్యారు. అయితే వారి తర్వాత ఆ రేంజ్ లో జనాకర్షణ కలిగి ఉండి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాలి. తన పార్టీ ఆవిర్భావమే తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలంగా మారింది అప్పట్లో.

కానీ సీన్ కట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం అనే పార్టీ చరిత్ర సృష్టిస్తుంది అనుకుంటే సినిమా వాళ్ళు ఇక రాజకీయాల్లో రాణించడం అనేది కష్టం అని క్లియర్ అయ్యంది. దీనితో అక్కడ నుంచి చిరంజీవి సినిమాలకి దూరం కావడం రాజకీయాల్లో కూడా విఫలం అవ్వడం అనేది ఒక పాఠంగా మారింది. దీని తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చెయ్యడం అక్కడ నుంచి అదే పార్టీలో కొనసాగడం జరిగింది.
అయితే తర్వాత మళ్ళీ రాజకీయాలకి దూరం అయ్యి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా మళ్ళీ సినిమాలో సాలిడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రాజకీయాలకి చాలా దూరంగానే న్నారు కానీ పలు సందర్భాల్లో మాత్రం తన భావాలు వ్యక్తం చేశారు. కానీ తాను ఏ పార్టీ తరపున కూడా చెబుతున్నట్టుగా వ్యక్తపరచలేదు. సో పొలిటికల్ గా అతీతంగానే ఉన్నారు కానీ తర్వాత కూడా తాను ఆ పార్టీలో చేరుతున్నారు ఈ పార్టీలో చేరుతున్నారు అంటూ పలు పుకార్లు ఎన్నో వచ్చేవి.

కానీ అవన్నీ అద్దం అని తేలింది. కాగా వీటిపై మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు అలాంటివి ఏమి లేవని చిరంజీవి గాి సభ్యత్వం ఇప్పటికీ రద్దు చేసుకోలేదు ఇప్పటికీ తమ పార్టీ లోనే ఉన్నారు అన్నట్టుగా చెప్పేవారు. దీనితో చిరు ఇప్పుడు వరకు ఆ పార్టీ లోనే ఉన్నారనే అంతా అనుకుంటున్నారు. కానీ లేటెస్ట్ గా తనపై మరో రూమర్ వైరల్ గా మారుతుంది.
దీనితో చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో చిరంజీవి ముందు రెండు ఆప్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. అందులో మెయిన్ గా తన తమ్ముడు పన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉంది కానీ చిరు మాత్రం అది కాకుండా భారతీయ జనతా పార్టీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయట. కాగా రీసెంట్ గానే చిరంజీవికి భారతీయ జనతా పార్టీ నుంచి ఓ కీలక పదవి కూడా చిరంజీవికి ఆఫర్ ఉంది అంటూ కూడా రూమర్స్ ఉన్నాయి. ఇలా మొత్తానికి చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ కోసం మళ్ళీ వార్తలు మొదలయ్యాయి. మరి ఇవి ఎంత మేర నిజమవుతాయి అనేది కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications











