RRR కోసం రంగంలోకి దిగిన రిలయన్స్.. స్టార్ ప్రొడ్యూసర్‌కి షాక్!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఇటీవలే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి ఆసక్తికర విషయాలని వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఎలాంటి కథతో తెరకెక్కించబోతున్నాం, నటీనటులు ఎవరు, విడుదుల తేదీ వంటి అంశాలని ప్రకటించారు. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ గురించి స్పష్టమైన ప్రకటన రావడంతో అన్ని భాషల్లోని నిర్మాతలు, బయ్యర్లు అలెర్ట్ అయిపోయినట్లు తెలుస్తోంది.

ఊహకందని విధంగా బిజినెస్

ఊహకందని విధంగా బిజినెస్

బాహుబలి చిత్రం సాధించిన వసూళ్లు చూసిన తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్ర బిజినెస్ ఊహకందని విధంగా ఉండబోతోందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర శాటిలైట్ హక్కుల కోసం 150 కోట్ల వరకు ఆఫర్ వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మీడియా సమావేశంలో రాజమౌళి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అజయ్ దేవగన్, అలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ చిత్రంలో భాగం కాబోతున్నారు. దీనితో హిందీలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి బడా సంస్థలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

కరణ్ జోహార్

కరణ్ జోహార్

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కు హిందీ మార్కెట్ పై మంచి పట్టు ఉంది. బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలని కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా హిందీలో విడుదల చేశారు. దీనితో కరణ్ జోహార్ ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం కూడా గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా కరణ్ జోహార్ కు పోటీగా రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ కూడా ఆర్ఆర్ఆర్ హిందీ హక్కుల కోసం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ డబ్బుకు వెనుకాడదు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ హక్కులు ఎవరు సొంతం చేసుకుంటారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

చాలా సమయం

చాలా సమయం

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2020 జులై 30న విడుదల చేయనున్నట్లు నిర్మాత దానయ్య ప్రకటించారు. విడుదలకు ఇంకా ఏడాదికిపైగా సమయం ఉండడంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం బిజినెస్‌పై ద్రుష్టి పెట్టడం లేదు. త్వరలో జరగబోయే బిజీ షెడ్యూల్స్‌పై ఫోకస్ పెట్టారు. వీలైనన్ని ఎక్కువ భాషల్లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 10 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు దానయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే.

 తెలుగు వీరుల కథ

తెలుగు వీరుల కథ

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు సమకాలీకులుగా జన్మించడం, యుక్తవయసులో ఒకేసారి అజ్ఞాతంలోకి వెళ్లడం, తిరిగి వచ్చి ఒకేవిధంగా వారి వారి ప్రాంతాల్లో స్వాతంత్ర పోరాటం చేయడం తనకు ఆసక్తిని కలిగించిందని రాజమౌళి తెలిపారు. వారు అజ్ఞాతంలోకి వెళ్లిన కాలాన్ని కల్పితగాధగా చిత్రీకరిస్తునట్లు రాజమౌళి తెలిపారు. రాంచరణ్‌కు జోడిగా అలియా భట్, ఎన్టీఆర్‌కు జోడిగా డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X