twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యుగానికి ఒక్కడు 2 స్టోరీ సిద్ధమే.. కానీ బడ్జెట్ బయపెడుతోందట?

    |

    యుగానికి ఒక్కడు సినిమా అంటే తెలియని సౌత్ ఆడియెన్స్ ఉండరు. ముఖ్యంగా తెలుగు ఆడియేన్స్ కి ఈ సినిమా అంటే చాలా ఇష్టం. తమిళ్ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఇక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. కార్తీ కూడా ఆ సినిమా ద్వారా తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఇకపోతే చాలా కాలం తరువాత సినిమాకు సంబంధించిన సీక్వెల్ పై రూమర్స్ వస్తున్నాయి.

    బెస్ట్ అడ్వెంచర్ మూవీ..

    బెస్ట్ అడ్వెంచర్ మూవీ..

    ఇండియన్ సినిమా హిస్టరిలో మునుపెన్నడు లేని విధంగా యుగానికి ఒక్కడు సినిమాను దర్శకుడు శ్రీ రాఘవ తెరకెక్కించాడు. చోళులు, పాండ్యులకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఒక కొత్త ఫీల్ ని కలిగిస్తాయి. ఒక్కో సమస్యను దాటుకుంటూ వెళ్లడం సినిమాలో హైలెట్ పాయింట్స్. చెప్పాలంటే అప్పట్లో ఈ సినిమా సౌత్ లో వచ్చిన బిగ్గెస్ట్ అడ్వెంచర్ మూవీ.

    తెలుగులో బాక్సాఫీస్ హిట్..

    తెలుగులో బాక్సాఫీస్ హిట్..

    దర్శకుడు సెల్వా రాఘవన్ 7/G బృందావన కాలనీ సినిమా తరువాత తెలుగులో చేసిన ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమా కూడా సక్సెస్ కావడంతో తెలుగులో శ్రీ రాఘవ అని ఒక నేమ్ సెట్ చేసుకున్నాడు. దీంతో తెలుగులో యుగానికి ఒక్కడు సినిమా రిలీజ్ అవ్వగానే సాలీడ్ ఓపెనింగ్స్ ని అందుకుంది. హిస్టారికల్ మూవీ అంటూ పాజిటివ్ కామెంట్స్ రావడంతో 2010లో బెస్ట్ హిట్స్ లో ఈ సినిమా కూడా స్థానం సంపాదించుకుంది.

    సీక్వెల్ స్టోరీ సిద్ధమే..

    సీక్వెల్ స్టోరీ సిద్ధమే..

    తెలుగులో సక్సెస్ అయినంతగా ఎందుకో ఈ సినిమా తమిళ్ లో సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు టీవీల్లో,యూ ట్యూబ్ లో సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక దర్శకుడు శ్రీ రాఘవ సీక్వెల్ కథను ఎప్పుడో సిద్ధం చేశాడు. అప్పట్లోనే యుగానికి ఒక్కడు సినిమాకు 32కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇక ఇప్పుడు సీక్వెల్ కోసం చాలా ఎక్కువ బడ్జెట్ అవసరం అవుతుందట..

    Recommended Video

    Mahesh Babu At Kondareddy Buruju Pic Goes Viral || 16 ఏళ్ల తర్వాత అంటూ డైరెక్టర్ కామెంట్
    బడ్జెట్ భయం..

    బడ్జెట్ భయం..

    నిజానికి దర్శకుడు శ్రీ రాఘవ గనక ఫామ్ లో ఉండి ఉంటే ఈపాటికే యుగానికి ఒక్కడు సీక్వెల్ తెరపైకి వచ్చెదట. కానీ ఆయన చేస్తున్న సినిమాలు గత కొంత కాలంగా వరుసగా డిజాస్టర్ లిస్ట్ లో చేరుతున్నాయి. ముఖ్యంగా ఆ మధ్య వర్ణ అనే బిగ్ బడ్జెట్ మూవీ తీసి కోట్ల నష్టాన్ని చూడాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు యుగానికి ఒక్కడు 2 కోసం 150కోట్లయినా ఖర్చు చేయాలని అనుకుంటూ ఉండగా నిర్మాతలు ఆ దర్శకుడి గత సినిమాల రిజల్ట్స్ చూసి బయపడుతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    There will be no South audiences who know the yuganiki okkadu cinema, Telugu audiences in particular are very fond of this movie. The Tamil dubbing film, though, has made good money. Karthi also became very close to Telugu audiences through the film. If not, then the rumors on the sequel to the film are coming soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X