ఆ సెట్లోనే పవన్'కెమెరామేన్ గంగతో..'కీ సీన్స్

By Srikanya

పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం నిమిత్రం సారధీ స్టూడియోలో భారి సెట్ వేస్తున్నారు. సినిమాలో వచ్చే కీ సీన్స్ మొత్తం ఇక్కడే షూట్ చేయనున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు.

నాలుగు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేయాలని పూరీ జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి స్క్రిప్టును దర్శకుడు పూరి జగన్నాథ్‌ పవన్‌ కళ్యాణ్‌కు వినిపించాడు. కథ మొత్తం వినగానే పవన్‌ ఎంతగానో ఉద్వేగానికి లోనయ్యాడట. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గర్వపడుతున్నానని పవన్‌ కామెంట్‌ చేసినట్టు చెబుతున్నారు.ఆ కామెంట్‌తో ఉబ్బితబ్బిబ్బయిన పూరి జగన్నాథ్‌కు అసలు నిద్ర పట్టడం లేదట.


అలాగే 'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. ఇదంతా వీడియోగా తీసి పూరీ..యూ ట్యూబ్ లో పెట్టాడు. తమన్నా హీరోయిన్‌గా నటించే ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌ 9న ప్రారంభం కానుంది. వచ్చే అక్టోబర్‌ 18న దీనిని విడుదల చేయడానికి పూరి జగన్నాథ్‌ ప్లాన్‌ చేశాడు.

ఇక ఈ చిత్రంకు పనిచేసే నటీనటులు,సాంకేతిక నిపుణులు వివరాలు


బ్యానర్ : యూనివర్సల్ మీడియా

నటీనటులు:పవన్ కళ్యాణ్, తమన్నా, ప్రకాశ్‌ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు.
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
ఎడిటింగ్: ఎ,ఆప్,శేఖర్
ఫైట్స్: విజయ్
నిర్మాత: డివివి దానయ్య
సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు గా కనిపిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X