ఎన్టీఆర్ బయోపిక్.. డైరెక్టర్ క్రిష్‌కు షాక్.. కంగన రనౌత్ చిత్రానికి దూరం!
Recommended Video

టాలీవుడ్ లో దర్శకుడు క్రిష్ తనకంటూ విభిన్నమైన శైలిని ఏర్పరుచుకున్నారు. గమ్యం, కంచె లాంటి చిత్రాలతో ప్రతిభగల దర్శకుడిగా క్రిష్ పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో క్రిష్ బిజీగా గడుపుతున్నాడు. భారీ అంచనాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదిలా ఉండగా క్రిష్ కు ఊహించని షాక్ ఎదురైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం మణికర్ణిక. ఝాన్సీ లక్ష్మి భాయి ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోంది.

మణికర్ణికకు దూరం
మణికర్ణిక చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయింది. కొద్దిభాగం మాత్రమే ఉంది. కానీ క్రిష్ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీగా ఉన్నాడు. దీని వలన మణికర్ణిక పోస్ట్ ప్రొడక్షన్ పనులపై క్రిష్ దృష్టి సారించలేకున్నాడు.

విజయేంద్ర ప్రసాద్
ఈ చిత్రానికి రచయిత విజయేంద్ర ప్రసాద్.క్రిష్ ఈ చిత్రానికి దూరం కావడంతో ప్రస్తుతం ఆయనే దర్శకత్వ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన భాగం షూటింగ్ ఫినిష్ చేసి వద్దామన్నా.. బాలయ్య అనుమతించడం లేదని టాక్. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతుండడంతో దానిపై దృష్టి పెట్టాలని బాలయ్య సూచించినట్లు తెలుస్తోంది.

నటీనటుల ఎంపిక
క్రిష్ ఓ వైపు ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ కొనసాగిస్తూనే నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టాడు. స్టార్ హీరో రానా, రకుల్ ప్రీత్ సింగ్, సుమంత్ వంటి నటులంతా ఈ చిత్రంలో భాగమవుతున్న సంగతి తెలిసిందే.

సంక్రాంతికి
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని 2019 సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.


Click it and Unblock the Notifications











