శ్రీలీల ఆఫర్ కొట్టేసిన జాన్వీ కపూర్ చెల్లి.. ఆ స్టార్ కొడుకుతో రొమాన్స్
సరైన హిట్స్ లేకపోయినప్పటికీ కూడా మంచి ఫామ్ లో ఉన్నటువంటి హీరోయిన్ అది కూడా తెలుగు నుంచి ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే స్టార్ బ్యూటీ శ్రీలీల అనే చెప్పాలి. కాగా శ్రీలీల హీరోయిన్ గా తెలుగులో ఇపుడు ఎన్నో సినిమాలు చాలా తక్కువ టైం లోనే చేసేసి మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారింది. కాగా ఈ సినిమాలు మాత్రమే కాకుండ పలు బ్రాండింగ్ ఎండోర్స్మెంట్ లకి కూడా ఈమె ఫేస్ గా మారింది.
ఇలా ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల ఒక్క తెలుగు లోనే కాకుండా రీసెంట్ గానే తమిళ్ లో కూడా అడుగు పెట్టినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. హీరో శివ కార్తికేయన్ కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ చిత్రం పరాశక్తి తో తమిళ్ ఎంట్రీ ఇస్తుండగా సౌత్ లో మంచి లైనప్ తో శ్రీలీల మోస్ట్ వాంటెడ్ గా మారింది. అయితే ఓ హీరోయిన్ ఇంతలా సెన్సేషనల్ అవుతుంది అంటే హిందీ మార్కెట్ నుంచి కూడా పిలుపులు ఉంటాయి.

అలానే శ్రీలీల కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది అని ఎప్పుడు నుంచో పలు కథనాలు ఉన్నాయి. కాగా ఆమె మొదటి సినిమా గత ఏడాదిలోనే బాలీవుడ్ లో మొదలవ్వాల్సి ఉంది కానీ అది చివరి నిమిషంలో ఆగిపోయింది. దీనితో శ్రీలీల మొదటి సినిమాకే దెబ్బ పడింది. ఇక అది అయ్యాక రీసెంట్ గానే శ్రీలీల ఎంట్రీ ఓ బాలీవుడ్ స్టార్ తాలూకా కొడుకుతో ఉంటుంది అని పలు రూమర్స్ వచ్చాయి.
అలాగే ఆమెతో పాటుగా ఆ యువ హీరోకి కూడా అదే తొలి సినిమాగా పరిచయం అవుతున్నాడని టాక్ వచ్చింది. మరి ఆ హీరోనే రీసెంట్ దేవర ఫేమ్ సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్. ఇబ్రహీం అలాగే శ్రీలీల కాంబినేషన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అని అనుకున్నారు కానీ ఇపుడు శ్రీలీల ప్లేస్ లో అదే దేవర బ్యూటీ జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ నటిస్తున్నట్టుగా ఇపుడు బాలీవుడ్ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి.

దీనితో మళ్ళీ శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి ఊహించని ట్విస్ట్ వచ్చిందని చెప్పాలి. మరి ఆమెని ఎందుకు తప్పించారో లేక వీరిద్దరి కలయికలో మరో సినిమా కానీ ఉందా అనేది కాలమే డిసైడ్ చెయ్యాలి. అయితే నార్త్ వర్గాలు అన్నీ శ్రీలీల ఇబ్రహీం అలీఖాన్ ల ఎంట్రీ కలిపే ఉంటుంది అని అన్నారు కానీ చివరి నిమిషంలో ఇలా జరిగింది.
సో మొత్తానికి శ్రీలీల కాకుండా జాన్వీ కపూర్ చెల్లెలితో రొమాన్స్ చేయనున్నాడని చెప్పవచ్చు. అన్నట్టు ఈ సినిమాని "నడానియాన్" అనే సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని పాపులర్ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు అనౌన్స్ చేశారు. ఇక ప్రస్తుతం శ్రీలీల రీసెంట్ గానే పాన్ ఇండియా సెన్సేషనల్ చిత్రం పుష్ప 2 లో హాట్ ఐటెం సాంగ్ చేయగా ఈ సాంగ్ తర్వాత మళ్ళీ సినిమాల్లో హీరోయిన్ గా బిజీగా మారిపోయింది.


Click it and Unblock the Notifications











