బిగ్ షాకింగ్: ‘సైరా: నరసింహారెడ్డి’ వాయిదా.. వాళ్ల కోరిక మేరకు రామ్ చరణ్ నిర్ణయం.!

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మన సినిమాల హవా కనిపిస్తోంది. కొద్దిరోజులుగా సాహో సందడి చేస్తుండగా.. ఇటీవలే సైరా: నరసింహారెడ్డి హడావిడి కూడా మొదలైంది. దీంతో అందరి దృష్టి టాలీవుడ్‌పై పడింది. సాహో విడుదలకు సిద్ధం అయిపోగా.. సైరా మాత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. చిరంజీవి కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..?

'వార్‌'‌‌ను తట్టుకోలేక సైరా వెనుకడుగు..

ప్రమోషన్ షురూ చేసేశారు

ప్రమోషన్ షురూ చేసేశారు

సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే ‘సైరా' మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ 14న విడుదల చేసింది. దీనికి భారీ స్పందన వచ్చింది. అలాగే, ‘సైరా' సినిమా టీజర్‌ను ఆగస్టు 20న వదిలారు. దీనికి కూడా విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత ముంబైలో ప్రెస్‌మీట్ కూడా నిర్వహించారు. దీనికి బడా స్టార్లు హాజరైన విషయం తెలిసిందే.

 సంచలన నిర్ణయం తీసుకున్నారట

సంచలన నిర్ణయం తీసుకున్నారట

సైరాను తెలుగు, హిందీతో పాటు మరికొన్ని భాషల్లో కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. గాంధీ జయంతి కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తోంది. అయితే, తాజాగా విడుదల తేదీ విషయంలో నిర్ణయం మార్చుకున్నారని ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన త్వరలోనే చేస్తారని టాక్.

వాళ్ల కోరిక మేరకు నిర్ణయం మార్చుకున్నారట

వాళ్ల కోరిక మేరకు నిర్ణయం మార్చుకున్నారట

హిందీలో అదే రోజు హృతిక్ రోషన్ - టైగర్ ష్రాప్ కాంబినేషన్‌లో వస్తున్న ‘వార్' కూడా రిలీజ్ అవుతోంది. దీని వల్ల సైరా హిందీ వర్షన్‌కు థియేటర్లు దొరకడం లేదట. ఇదే విషయాన్ని ఫర్హాన్ అక్తర్.. రామ్ చరణ్‌కు చెప్పాడట. అంతేకాదు, సినిమాను వారం పాటు వాయిదా వేద్దామని కూడా కోరాడని సమాచారం. ఆయన కోరికను లోకల్ డిస్టిబ్యూటర్లతో చెప్పిన తర్వాత రామ్ చరణ్ సినిమా వాయిదా వేయాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

కొత్త రిలీజ్ డేట్ ఆరోజేనట

కొత్త రిలీజ్ డేట్ ఆరోజేనట

అక్టోబర్ 2న రిలీజ్ చేయకపోతే.. 8వ తేదీన సైరాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాత రామ్ చరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎనిమిదో తేదీ నుంచి ఆదివారం వరకు వరుస సెలవులు ఉండడమే దీనికి కారణం అని అంటున్నారు. అన్ని చోట్లా దసరా సెలవులు ఉంటాయి కాబట్టి సినిమా కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుందని వాళ్లు భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

సైరా గురించి..

సైరా గురించి..

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమే ‘సైరా: నరసింహారెడ్డి'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొణెదల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X