ఎంత కష్టపడినా మెగాస్టార్ అనుకున్న సమయానికి రాలేరట!

మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఆచార్య కోసం మెగా అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ విషయంలో సస్పెన్స్ ఇంకా వీడలేదు.

దర్శకుడు కొరటాల ఇప్పటివరకు కేవలం 40 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి చేశాడు. ఇంకా మెగాస్టార్ తో చేయాల్సిన యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు రామ్ చరణ్ కి సంబంధించిన సీన్స్ కూడా షూట్ చేయాల్సి ఉంది. ఎంత కాదనుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు రెండు నెలల సమయం పడుతుంది. లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల సమయం వృధా అయ్యింది. మళ్ళీ కొత్త తరహా షెడ్యూల్స్ సిద్ధం చేసుకొని షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇక సినిమాను మొదట ఈ ఏడాది దసరాకి రిలీజ్ చేయాలని అనుకున్నారు.

Big suspense on megastar chiranjeevi acharya release time

కానీ ప్లాన్ చేంజ్ అవ్వడంతో 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా అనుమానమే అని తెలుస్తోంది. ఇంకా 60శాతం షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఇదే గ్యాప్ లో ఫినిష్ చేయాలి అంటే చాలా కష్టమైన పని. పైగా ప్రమోషన్స్ కోసం కూడా కొన్ని రోజులు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో ఎలా ఆలోచించినా కూడా మెగాస్టార్ ఆచార్య సంక్రాంతి రావడం కష్టమనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X